CBSE Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌

CBSE Class 12 Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

Updated : 12 May 2023 11:42 IST

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి (Class 12 results) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్‌, పరీక్షా సంగమ్‌ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది (92.71శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 5.38శాతం తగ్గిందని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఇక విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు గతేడాదిలాగే ఈసారి కూడా మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించట్లేదని బోర్డు అధికారులు వెల్లడించారు. అయితే, ప్రతి సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన 0.1శాతం విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తంగా 1,12,838 మంది విద్యార్థులు 90శాతం కంటే అధిక మార్కులు సాధించారు. ప్రాంతాల వారీగా తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 78.05శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి. 10వ తరగతి ఫలితాలను బోర్డు ఇంకా వెల్లడించలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని