TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు 14 నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. ఎక్కడంటే?
TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలివే..
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీస్ నియామక మండలి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తేదీలను ఖరారు చేసింది. జూన్ 14 నుంచి 26 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు వెల్లడించింది. వీటికి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లు జూన్ 11 ఉదయం 8గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,09,906మంది సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల వివరాలను విడుదల చేసింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ మార్కులను బోర్డు నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా మెరిట్ లిస్టును సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు. మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి మెడికల్ టెస్టు నిర్వహించి.. ఎస్‌బీ ఎంక్వైరీ చేస్తారు. క్రిమినల్ కేసులు ఉన్నవారిని ఈ పోస్టులకు అనర్హులుగా పరిగణిస్తారు. మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి ఎంపికైన అభ్యర్థులతో తుది ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు శిక్షణా షెడ్యూల్‌ను వారి లాగిన్‌లో ఉంచుతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో
-
GHMC: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యకార్మికురాలి మృతి
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్