నోటీస్‌బోర్డు

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీకి చెందిన దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 17 May 2021 00:42 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 7236 పోస్టులు

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీకి చెందిన దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 మొత్తం ఖాళీలు: 7236

పోస్టులు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, అసిస్టెంట్‌ టీచర్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, కౌన్సెలర్‌ తదితరాలు.
సబ్జెక్టులు: హిందీ, నేచురల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌, బెంగాలీ
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంలో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు, బీఏ(ఆనర్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: వన్‌ టైర్‌/ టూ టైర్‌ ఎగ్జాం స్కీం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 25, 2021.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 24, 2021.
https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board

సికిందరాబాద్‌ మిలిటరీ కాలేజ్‌లో..

సికిందరాబాద్‌ (తిరుమలగిరి)లోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఖీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతోంది.
పోస్టులు: ల్యాబొరేటరీ అటెండెంట్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ, లైబ్రరీ సైన్సెస్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌లో సర్టిఫికెట్‌ కోర్సు, డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.14950-రూ.18400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్‌) ఆధారంగా.
ఇంటర్వ్యూ: మే 20, 21, 2021. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు గడువు: మే 18, 2021.
చిరునామా: మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ) గేట్‌, తిరుమలగిరి, సికిందరాబాద్‌.

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఖాళీలు

సికిందరాబాద్‌-బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 మొత్తం ఖాళీలు: 33

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.

విభాగాలు: హిస్టరీ, సైన్స్‌, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, సైకాలజీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ ఉత్తీర్ణత. ఎంఎస్‌ ఆఫీస్‌ టెక్నాలజీ పరిజ్ఞానం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, బొల్లారం, జేజే నగర్‌, సికిందరాబాద్‌-500087. దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 05, 2021.
వెబ్‌సైట్‌: www.apsbolarum.edu.in/about%20us.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని