నోటీస్‌బోర్డు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 26 Jul 2021 02:49 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ - 363 ప్రిన్సిపల్‌ పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 363 (పురుషులు-208, స్త్రీలు-155)

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత, టీచింగ్‌ అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, జులై 29.

వెబ్‌సైట్‌: www.upsconline.nic.in/


ఇన్‌కంటాక్స్‌లో 155 పోస్టులు

ముంబయిలోని ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం 2021 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 155

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, స్క్వాష్‌, బిలియర్డ్స్‌, చెస్‌, క్యారమ్‌, బ్రిడ్జ్‌, బ్యాడ్మింటన్‌ తదితరాలు.

పోస్టులు-ఖాళీలు: ఇన్‌కంటాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌-08, టాక్స్‌ అసిస్టెంట్‌-83, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)-64.
అర్హత: పోస్టుల్ని అనుసరించి మెట్రిక్యులేషన్‌/ తత్సమాన, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, టైపింగ్‌ స్పీడ్‌, జాతీయ/ అంతర్జాతీయ క్రీడా ప్రదర్శన.

ఎంపిక విధానం: షార్ట్ట్‌లిస్టింగ్‌, గ్రౌండ్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 25. 

వెబ్‌సైట్‌: www.incometaxmumbai.in/


ఇండియన్‌ నేవీ-40 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

ఇండియన్‌ నేవీ.. జనవరి 2022 కోర్సు ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 40 జనరల్‌ సర్వీస్‌ (జీఎస్‌) -  ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 02 జనవరి 1997 నుంచి 01 జులై 2002 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కొవిడ్‌-19 కారణంగా ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించకుండా అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ షెడ్యూల్‌: 2021 సెప్టెంబరు నుంచి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 2021, జులై 16.

దరఖాస్తుకు చివరితేది: 2021, జులై 30.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/


రక్షణ మంత్రిత్వశాఖలో 458 ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన 41 ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 458

పోస్టులు: ట్రేడ్స్‌మెన్‌ మేట్‌, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌, ఫైర్‌మెన్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: కమాండెంట్‌, 41 ఫీల్డ్‌ అమ్యునిషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


ఫెలోషిప్స్‌
కేవీపీవై ఫెలోషిప్‌ - 2021

కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై) ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి భారత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరు దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా 2021 ప్రకటన విడుదలైంది. పాఠశాల, కళాశాల విద్యార్థులను బేసిక్‌ సైన్సెస్‌లో పరిశోధనల వైపు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన ఫెలోషిప్‌ (కేవీపీవై)  - 2021
ఆర్థిక ప్రోత్సాహం: యూజీ స్థాయిలో నెలకు రూ.5000తోపాటు కంటింజెన్సీ గ్రాంటు కింద ఏడాదికి రూ.20,000. పీజీ స్థాయిలో నెలకు రూ.7000, కంటింజెన్సీ గ్రాంటు కింద ఏడాదికి రూ.28,000 చెల్లిస్తారు.

కాలవ్యవధి: ప్రి పీహెచ్‌డీ స్థాయి వరకు లేదా ఐదేళ్లు. ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకు.

విభాగాలు: స్ట్రీమ్‌ ఎస్‌ఏ, స్ట్రీమ్‌ ఎస్‌ఎక్స్‌, స్ట్రీమ్‌ ఎస్‌బీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రస్తుతం (2021-22) ఇంటర్మీడియట్‌ ప్రథమ/ ద్వితీయ, డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్‌ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.

ఎంపిక: కేవీపీవై ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా.

పరీక్ష తేది: 2021, నవంబరు 07.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, జులై 12.
దరఖాస్తుకు చివరితేది: 2021, ఆగస్టు 25. 

 వెబ్‌సైట్‌: http://kvpy.iisc.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని