Current Affairs: కరెంట్‌ అఫైర్స్‌

దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ‘అగ్నిప్రైమ్‌’ బాలిస్టిక్‌ క్షిపణిని 2024, ఏప్రిల్‌ 4న విజయవంతంగా పరీక్షించారు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఎన్నోది?

Published : 13 Jun 2024 00:46 IST

 మాదిరి ప్రశ్నలు

దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ‘అగ్నిప్రైమ్‌’ బాలిస్టిక్‌ క్షిపణిని 2024, ఏప్రిల్‌ 4న విజయవంతంగా పరీక్షించారు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఎన్నోది? (డీఆర్‌డీవో, స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ సహకారంతో భారత సైన్యం ఈ క్షిపణిని ఒడిశా సముద్రతీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి పరీక్షించింది. ఇది మీడియం రేంజ్‌ క్షిపణి. దీని స్ట్రైక్‌ రేంజ్‌ 1000 నుంచి 2000 కి.మీ. వరకు ఉంటుంది. 1500 నుంచి 3000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇంటిగ్రేట్‌డ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐజీఎమ్‌డీపీ) కింద దీన్నిదేశీయంగా అభివృద్ధి చేశారు. ఐజీఎమ్‌డీపీలో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని,త్రిశూల్, నాగ్, ఆకాష్‌ క్షిపణులను అభివృద్ధి చేశారు.)

జ: ఆరోది


అస్సాంలోని సంప్రదాయ ‘బిహు’ డోలు వాయిద్యం, వారణాసి వీధుల్లో తయారుచేసే ‘బనారస్‌ తండయ్‌’ వంటకం లాంటి 60 అంశాలకు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో 2024, మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సుమారు ఎన్ని ఉత్పత్తులు, హస్తకళలు, చేనేతవస్త్రాలు, వస్తువులు, వంటకాలు లాంటి వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్లయ్యింది? (దిల్లీ, చెన్నైల్లో జాగ్రఫిక్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ కార్యాలయాలు ఉన్నాయి. దేశంలోనే మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ఉత్పత్తిగా డార్జిలింగ్‌ టీ ఘనత సాధించింది.)

జ: 635


ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా ఏ దేశవాసి జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టెన్నిస్‌ వుడ్‌ (111 ఏళ్లు) తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు? (114 ఏళ్ల జువాన్‌ విసెంటీ పెరెజ్‌ మోరా (వెనెజువెలా) ఇటీవలే చనిపోవడంతో జాన్‌ ఆల్ఫ్రెడ్‌కు ఈ రికార్డు దక్కింది.)

జ: బ్రిటన్‌ 




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని