Damini: ఉరుములు.. మెరుపులపై దామిని హెచ్చరికలు!

ఇటీవల టీ-20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన భారత్, ఆ ఘనతను రెండుసార్లు సాధించిన జట్ల జాబితాలో చేరింది. జనాభా వృద్ధి కోసం కనీసం నలుగురు పిల్లలను కన్న దంపతులకు హంగేరి ప్రభుత్వం జీవితాంతం పన్ను మినహాయింపు ఇచ్చింది.

Published : 11 Jul 2024 00:40 IST

కరెంట్‌ అఫైర్స్‌

ఇటీవల టీ-20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన భారత్, ఆ ఘనతను రెండుసార్లు సాధించిన జట్ల జాబితాలో చేరింది. జనాభా వృద్ధి కోసం కనీసం నలుగురు పిల్లలను కన్న దంపతులకు హంగేరి ప్రభుత్వం జీవితాంతం పన్ను మినహాయింపు ఇచ్చింది. రాబందుల సంతతిని వృద్ధి చేసే తొలి బ్రీడింగ్‌ కేంద్రం ఇండియాలో ఏర్పాటు కాబోతోంది. స్టేట్‌బ్యాంకు తదుపరి ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. దేశ పౌరులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు, వాతావరణం, వర్ష సమాచారం చేరవేసేందుకు కేంద్రం ప్రత్యేక యాప్‌లు తీసుకొచ్చింది. బిహార్‌లో విద్య, ఉద్యోగాల్లో యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అక్కడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న వర్తమాన విశేషాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రపంచవ్యాప్త రాజకీయ పరిణామాలు, వెలువడిన నివేదికలు, వివిధ అంశాల్లో దేశాల వారీ ర్యాంకులు, వైజ్ఞానిక, రక్షణ రంగాల్లో ఆవిష్కరణలు, ప్రముఖుల జీవిత గాథలపై విడుదలైన పుస్తకాల సరికొత్త వివరాలను తెలుసుకోవాలి.

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో సరైంది?

ఎ) 2024 పురుషుల టీ-20 ప్రపంచకప్‌ (9వది) విజేత ఇండియా.

బి) 2024 పురుషుల టీ-20 ప్రపంచకప్‌ రన్నర్‌  దక్షిణాఫ్రికా.

సి) 2024 పురుషుల టీ-20 ప్రపంచకప్‌ వెస్టిండీస్, అమెరికాల్లో జరిగింది.

డి) పురుషుల టీ-20 ప్రపంచకప్‌ను ఇండియా  మొదటిసారిగా 2007లో నెగ్గింది.

ఇ) టీ-20 పురుషుల వరల్డ్‌కప్‌ను రెండుసార్లు నెగ్గిన జట్లు 4

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి, ఇ 

3) ఎ, బి, సి, డి, ఇ 4) ఎ, బి, సి

నోట్‌: టీ-20 పురుషుల వరల్డ్‌కప్‌ను రెండుసార్లు నెగ్గిన జట్లు 3.

1) ఇండియా (2007, 2024) 

2) వెస్టిండీస్‌ (2012, 2016) 

3) ఇంగ్లండ్‌ (2010, 2022)

2. కిందివాటిలో సరైంది?

ఎ) 2026 లో టీ-20 పురుషుల ప్రపంచకప్‌ ఇండియా, శ్రీలంక దేశాల్లో జరుగుతుంది.

బి) 2028 లో టీ-20 పురుషుల ప్రపంచకప్‌  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో జరుగుతుంది.

సి) 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ-20 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియా.

డి) మహిళల టీ-20 వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా 5 సార్లు నెగ్గింది.

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 

3) బి, సి, డి 4) ఎ, సి, డి

నోట్‌: మహిళల టీ-20 వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా 2010, 2012, 2014, 2018, 2020, 2023 ల్లో మొత్తం 6 సార్లు గెలిచింది.

3. ఇటీవల అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)లో 100వ సభ్యదేశంగా చేరిన దేశం?

1) రిపబ్లిక్‌ ఆఫ్‌ పరాగ్వే   2) ఫ్రాన్స్‌ 

3) ఫిజి 4) న్యూజిలాండ్‌ 

4. కిందివాటిలో సరైంది?

ఎ) 2024 సంవత్సరానికి అరుంధతీ రాయ్‌కు పెన్‌పింటర్‌ పురస్కారం వచ్చింది.

బి) 2009లో ఇంగ్లిష్‌ పెన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ అవార్డును స్థాపించింది.

సి) కామన్వెల్త్‌ కథానికల పోటీలో ముంబయికి చెందిన సంజనా ఠాకుర్‌ ప్రథమ బహుమతి పొందారు.

డి) ద ఆసియన్‌ బ్యాంకర్‌ సెబీ సంస్థకు బెస్ట్‌ బిజినెస్‌ రెగ్యులేటర్‌ అవార్డు ఇచ్చింది.

1) ఎ, బి, సి 2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి, డి 4) సి, డి 

5. వరల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ర్యాంకింగ్స్‌ 2023లో భారత్‌ ర్యాంకు ఎంత?

1) 8వ    2) 15వ    3)18వ     4) 24వ

నోట్‌: మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా నిలిచాయి. యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

6. ప్రపంచ ఇంధన పరివర్తన సూచీలో భారతదేశం స్థానం ఎంత?

1) 63 వ   2) 15వ   3) 68వ   4) 70వ 

నోట్‌: 1, 2, 3వ స్థానాల్లో వరుసగా స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్‌లు నిలిచాయి. 

7. ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌గా ఎవరు నియమితులు కానున్నారు?

1) చల్లా శ్రీనివాసులు 2) చల్లా రామానంద 

3) ఆర్‌.దినేష్‌ చంద్ర 4) ఎం.రవీంద్ర కుమార్‌

8. కిందివాటిలో సరైంది?

ఎ) చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 603/6 పరుగులు చేసి టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.

బి) ఈ టెస్ట్‌లో షెఫాలీవర్మ అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా (194 బంతుల్లో) రికార్డు నెలకొల్పింది.

సి) ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఆస్ట్రేలియా (575/9) పేరు మీద ఉంది.

డి) తక్కువ బంతుల్లో టెస్టుల్లో డబుల్‌ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అన్నాబెల్‌ (248 బంతుల్లో) పేరు మీద ఉండేది.

1) ఎ, బి 2) ఎ, బి, సి, డి 

3) బి, సి, డి 4) ఎ, బి, సి 

9. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

1) రవి గుప్తా 2) రవి అగర్వాల్‌ 

3) కిరణ్‌ గుప్తా 4) సుమిత్రా చంద్రన్‌

10. బ్రిక్స్‌ గేమ్స్‌ - 2024 (రష్యాలో జరిగాయి) లో భారత్‌ 9 పతకాల (3 బంగారం, 6 వెండి, 20 కాంస్యం) తో పతకాల పరంగా ఏ స్థానంలో నిలిచింది?

1) 6వ     2) 7వ     3) 8వ     4) 3వ 

నోట్‌: 509 పతకాలతో రష్యా తొలి స్థానంలో నిలిచింది (266 బంగారం, 142 వెండి, 20 కాంస్యం).

11. కిందివాటిలో సరైంది?

ఎ) కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన తీవ్ర నిరసనల్లో ఆ దేశ పార్లమెంటు ప్రాంగణంలోని భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు.

బి) బుర్కినా ఫాసో దేశం అశ్లీలత చిత్రాల   (పోర్నోగ్రఫీ) ను ఇటీవల నిషేధించింది.

సి) జర్మనీలోని ఒవేరియాలో 11 మిలియన్‌ ఏళ్ల నాటి కోతి జాతి శిలాజాన్ని ఇటీవల గుర్తించారు.

డి) ప్రపంచంలోనే తొలిసారి తీవ్ర మూర్చవ్యాధి నియంత్రణ కోసం 12 ఏళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్‌ దేశ శాస్త్రవేత్తలు న్యూరోస్టిమ్యులేటర్‌ అనే సాధనాన్ని అమర్చారు.

1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి 

3) బి, సి 4) సి, డి 

12. సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) వెల్లడించింది?

1) 16.70 కోట్లు 2) 20.16 కోట్లు  

3) 11.70 కోట్లు  4) 31.16 కోట్లు

13. ఏ దేశ అధ్యక్షుడిగా పీటర్‌ పెల్లెగ్రినీ ఇటీవల నియమితులయ్యారు?

1) స్లోవేకియా 2) పోలండ్‌  

3) మాల్టా  4) స్పెయిన్‌

14. మైత్రి మిలటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి?

1) భారత్‌ - శ్రీలంక  2) భారత్‌ - థాయ్‌లాండ్‌

3) భారత్‌ - చైనా    4) భారత్‌ - మయన్మార్‌

15. ప్రపంచంలో తొలి రాబందుల (ఆసియన్‌ కింగ్‌ వల్చర్‌) కన్జర్వేషన్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ను ఏ రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేస్తున్నారు?

1) మహారాష్ట్ర  2) గుజరాత్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌  4) మధ్యప్రదేశ్‌

16. హిజాబ్‌తోపాటు ఇతర ఇస్లామిక్‌ సంప్రదాయ వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది?

1) అఫ్గానిస్థాన్‌   2) ఇరాన్‌  

3) ఇరాక్‌  4) తజికిస్థాన్‌

17. అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం ఎప్పుడు?

1) జూన్‌ 24  2) జూన్‌ 29  

3) జూన్‌ 22  4) జూన్‌ 23

నోట్‌: 2024 థీమ్‌ ‘ముందుకు కదులుదాం, వేడుక  చేసుకుందాం’ (లెట్స్‌ మూవ్‌ అండ్‌ సెలబ్రేట్‌)

18. కిందివాటిలో సరైంది?

ఎ) జననాలు తగ్గిపోవడంతో హంగేరి దేశంలో  నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు.

బి) డెన్మార్క్‌లో ఆవులు, గొర్రెలు, పందులు పెంచుతున్నవారికి 2030 నుంచి కార్బన్‌ ట్యాక్స్‌ విధించాలని యోచిస్తున్నారు.

సి) భారతదేశంలో వ్యవసాయ రంగం బలోపేతం కోసం ఆస్ట్రేలియాతో మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఎంఎస్‌డీఈ) ఒప్పందం కుదుర్చుకుంది.

1) ఎ, బి, సి  2) ఎ, బి   

3) బి, సి    4) ఎ, సి

19. ‘వెంకయ్య నాయుడు - ఎ లైఫ్‌ ఇన్‌ సర్వీస్‌’,  ‘సెలబ్రేటింగ్‌ భారత్‌’, ‘మహానేత’ అనే మూడు పుస్తకాలను ఇటీవల ఎవరు విడుదల చేశారు?

1) ద్రౌపది ముర్ము  2) నరేంద్ర మోదీ

3) జగదీప్‌ ధన్‌ఖఢ్‌   4) అబ్దుల్‌ నజీర్‌

20. ఆశాభోంస్లే బయోగ్రఫీ ‘స్వరస్వామిని ఆశా’ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు?

1) ద్రౌపది ముర్ము  2) నరేంద్ర మోదీ  

3) జగదీప్‌ ధన్‌ఖడ్‌  4) మోహన్‌ భగత్‌

21. కిందివాటిలో సరైంది?

ఎ) కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ esankhyiki పోర్టల్‌ను ఇటీవల ప్రారంభించింది.

బి) ఉరుములు, మెరుపులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం కోసం కేంద్రం ‘దామిని’ యాప్‌ ప్రారంభించింది.

సి) వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ‘మేఘదూత్‌’ యాప్‌ను కేంద్రం ప్రారంభించింది.

డి) వర్ష సూచనకు, వర్షం ఎప్పుడు వస్తుందనే  సమాచారం కోసం రెయిన్‌ అలారం యాప్‌ను కేంద్రం ప్రారంభించింది.

ఇ) 2024, జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నూతన నేర న్యాయచట్టాలపై అవగాహన కల్పించడానికి Sangyan యాప్‌ను ఆర్‌పీఎఫ్‌ ఆవిష్కరించింది.

1) ఎ, బి, సి, డి  2) ఎ, బి, సి, డి, ఇ  

3) ఎ, బి, సి  4) ఎ, బి, సి, ఇ

22. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ ఏ రాష్ట్రం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌  2) కేరళ  

3) మధ్యప్రదేశ్‌  4) బిహార్‌

23. అఫ్గానిస్థాన్‌పై మూడో యూఎన్‌వో కాన్ఫరెన్స్‌ ఇటీవల ఎక్కడ జరిగింది?

1) న్యూదిల్లీ   2) పారిస్‌  3) దోహా  4) సనా

24. కిందివాటిలో సరైంది?

ఎ) సైనిక బలగాల శక్తిని పెంచే అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఇండియన్‌ నేవీ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది.

బి) ఈ శక్తిమంతమైన పేలుడు పదార్థం (బాంబు) పేరు ళీనితీనిశ్రీ2.

సి) నాగ్‌పుర్‌కు చెందిన ఎకనామిక్‌ ఎక్స్‌ప్లోసివ్స్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.

1) ఎ, బి       2) బి, సి 

3) ఎ, సి       4) ఎ, బి, సి

సమాధానాలు : 1-1; 2-2; 3-1; 4-3; 5-2; 6-1; 7-1; 8-2; 9-2; 10-3; 11-2; 12-3; 13-1; 14-2; 15-3; 16-4; 17-4; 18-1; 19-2; 20-4; 21-2; 22-4; 23-3; 24-4. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని