DRDO Jobs: డీఆర్‌డీవోలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ₹లక్ష వరకు వేతనం.. అర్హతలివే..!
DRDO Jobs: డీఆర్‌డీవోలో సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సైన్స్ సంబంధిత కోర్సుల్లో బీటెక్/పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
ఇంటర్నెట్ డెస్క్: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ ‘బి’ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డీఆర్‌డీవో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొంది. ఆసక్తి కలిగినవారు https://rac.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ జనరేట్ అయినప్పటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) వెల్లడించింది.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు..
- విద్యార్హతలు: ఆయా పోస్టులను బట్టి ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్/మెకానికల్/కంప్యూటర్‌సైన్స్/ఎలక్ట్రికల్/మెటీరియల్ సైన్స్/కెమికల్ ఇంజినీరింగ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్/సివిల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్‌లో బీటెక్ పాసై ఉండాలి. అలాగే, వీటిలో కొన్ని ఉద్యోగాలకు ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ/మేథమెటిక్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారిని ఎంపిక చేస్తారు. దీంతో పాటు గేట్ స్కోరును కీలంగా పరిగణిస్తారు.
- ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఆగస్టు 31 నాటికి వారు తమ డిగ్రీ/ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 181 పోస్టుల్లో దివ్యాంగులకు ఏడు పోస్టులను రిజర్వు చేశారు.
- భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మెట్రో నగరాల్లో నెలకు దాదాపు రూ.లక్ష వరకు వేతనం అందజేస్తారు.
- ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- వయో పరిమితి: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 28ఏళ్లు మించరాదు. ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 33 ఏళ్లు మించరాదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Nara Lokesh: జగన్ మాదిరిగా వాయిదాలు కోరను.. సీఐడీ నోటీసుపై స్పందించిన లోకేశ్