Education News: పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చా?

బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ 2023లో పాసయ్యాను. సీపీజీఈటీకి దరఖాస్తు చేసుకోవచ్చా? 

Published : 30 May 2024 00:12 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ 2023లో పాసయ్యాను. సీపీజీఈటీకి దరఖాస్తు చేసుకోవచ్చా?

 వంశీకృష్ణ

 మీరు డిగ్రీలో ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో ఇప్పటికే ఉత్తీర్ణత సాధించారు కాబట్టి నిరభ్యంతరంగా సీపీజీఈటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్షను గత కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. సీపీజీఈటీ రాయడానికి ఇప్పటికే డిగ్రీ పూర్తయినవారు, అడ్మిషన్‌ అయ్యేనాటికి డిగ్రీ పూర్తి చేయగలిగేవారు అర్హులు. డిగ్రీలో 40 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా కనీస ఉత్తీర్ణత సరిపోతుంది. కంపార్ట్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా నిర్థారిత మార్కుల శాతం పొందితే, సీపీజీఈటీ రాయడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి వయః పరిమితి లేదు. నోటిఫికేషన్‌ ప్రకారం- సోషల్‌ సైన్స్, హ్యుమానిటీస్‌కు సంబంధించిన చాలా సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశపరీక్ష రాయడానికి డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినా అర్హత ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 17 జూన్, 2024 చివరి తేదీ. 2000 రూపాయిల అపరాధ రుసుముతో 30 జూన్, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీపీజీఈటీని 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో, 90 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని