ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 276 మంది ఎంపిక

Updated : 22 Dec 2022 20:16 IST

హైదరాబాద్‌: ఈనాడు జర్నలిజం స్కూలు డిసెంబరు 4న నిర్వహించిన రాతపరీక్షలో 276 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 663 మంది దరఖాస్తు చేసుకున్నారు. బృంద చర్చలకు, ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన 276 మందిలో 169 మంది మల్టీమీడియాకు, 63 మంది టెలివిజన్‌కు, 44 మంది మొబైల్‌ జర్నలిజం విభాగానికి చెందిన వారు ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. రాత పరీక్షలో నెగ్గిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా కూడా సమాచారం అందుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని