కొత్త ఏడాదిలో కొట్టాలి కొలువు!
‘కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల’నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి! సర్కారీ కొలువు ఆశించేవారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ అవకాశాలు పరిమితమైనవి. నూతన సంవత్సరంలో యూపీఎస్సీ, రాష్ట్ర సర్వీస్ కమిషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రకటించే నోటిఫికేషన్లలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని యువత సహజంగానే ప్రయత్నిస్తుంది. ఆ దిశలో తీర్మానాలూ చేసుకుంటారు. ఈ లక్ష్యసాధనకు దృఢంగా నిలబడాలంటే.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తరహా ఆలోచనా విధానం పెంచుకోవాలి?
యూపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో రాత నైపుణ్యం చాలా ముఖ్యం. బ్యాంకింగ్ పరీక్షల్లో వేగంగా చేయగలిగే నైపుణ్యం ప్రధానం. యూనిఫామ్ ఉద్యోగాల్లో శారీరక నైపుణ్యాలు కీలకం. రాష్ట్రస్థాయి గ్రూప్-2 లాంటి పరీక్షల్లో వివిధ అంశాలను విశ్లేషించే నైపుణ్యాలు అవసరం. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.
పరీక్షల్లో పోటీ పరీక్షలు వేరయా
అకడమిక్ పరీక్షల్లో కష్టపడిన వారందరూ స్కోర్లు సాధించి విజేతలవుతారు. పోటీ పరీక్షల్లో విజేతలు తక్కువ; పరాజితులే ఎక్కువ. పోటీ పరీక్షల్లో చదివే విధానం అకడమిక్ పరీక్షల్లో చదివే విధానం కంటే చాలా భిన్నమైంది. ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను, దాన్ని నిర్వహించే సంస్థ, ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ లక్ష్యాలు ఏమిటి? అభ్యర్థుల నుంచి వారు ఆశిస్తున్నది ఏమిటి? మొదలైనవి దృష్టిలో పెట్టుకుని సన్నద్ధతను అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే పరీక్షకు అవసరమైన రీతిలో తయారవుతారు. పోటీ పరీక్షల్లో సిలబస్ అనేది నామమాత్రం. ఏయే సందర్భాల్లో సిలబస్‌కి బయట వెళ్లి మరీ ప్రశ్నలడుగుతారనేది అంచనా వేయగలిగినప్పుడు విజయాన్ని సాధించటానికి మారం సుగమమవుతుంది. ఏ విషయాన్ని పరిహరించాలి, దేన్ని అదనంగా చదవాలి అనే అవగాహన పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యం. సిలబసులోని ఏ విషయాల్లో కనిష్ఠ, మధ్యమ, గరిష్ఠ స్థాయుల్లో ప్రిపరేషన్ ఉండాలో నిర్ణయించుకోవడమూ విజయానికి దారి తీసే అంశమే.
సుదీర్ఘ పోరుకు సంసిద్ధత
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి సంస్థలు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల ఖాళీలను బట్టి మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారు.అయితే రాష్ట్రస్థాయిలో నిర్వహించే అనేక పరీక్షలు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లవు. రాష్ట్ర సర్వీస్ కమిషన్ల ద్వారా వచ్చే గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన వాటితో పాటు ఉపాధ్యాయ, ఎస్ఐ, కానిస్టేబుల్ మొదలైన ఉద్యోగాల పరీక్షలు ఏమాత్రం కచ్చితత్వం లేనివి. కొన్నికొన్ని సందర్భాల్లో వాటికోసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలపాటు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అది కూడా కచ్చితత్వం ఉండదు. కోర్టు కేసులు, ఇతరత్రా ఉపద్రవాలను బట్టి సుదీర్ఘ కాలం ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు తమ తక్షణ అవసరాలేమిటో స్పష్టంగా నిర్వహించుకుని వాటికి అనుగుణంగా ఈ ఉద్యోగాలను పొందగలమా లేదా అని విశ్లేషించుకోవాలి. సుదీర్ఘ కాలం పోటీ పరీక్షల కోసం వెచ్చించలేనివారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడమే సముచితం.
నిరంతర ప్రేరణ
పోటీ పరీక్షల్లో కాలం గడిచే కొద్దీ అనేక సవాళ్ల వల్ల ప్రేరణ కోల్పోయి రంగం నుంచి విరమించే వారి శాతం చాలా ఎక్కువ. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతుండటం కూడా అంతే ముఖ్యం. విజయాలను సాధించిన వ్యక్తులు అనుసరించిన మార్గాలను పరిశీలించటం, విజయం సాధించాక వచ్చే ఫలితాలను ఊహించుకోవటం, మంచి స్నేహితులుండే బృందంలో సభ్యులు కావటం, యోగా, ప్రాణాయామం లాంటివి అనుసరించడం, ప్రతికూల ధోరణితో ఉండేవారికి దూరంగా ఉండటం, లాంటి మెలకువల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ ఉంటే ఆశించిన ఫలితాలు దగ్గరవుతాయి.
మీకుందా ప్లాన్- బి?
‘అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే ఏమిటి’? అనే ప్రశ్న వల్ల అభ్యర్థులు చాలా సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల విజయావకాశాలను తగ్గించుకుంటారు. ‘పోటీ పరీక్షల్లో సహజంగా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అదే జీవన్మరణ సమస్య’ అని చెబుతూ ఉంటారు. కానీ అది అంత సరైన ఆలోచన కాదు. ఎప్పుడైతే జీవన్మరణ సమస్య అనుకుంటామో రెట్టించి చదువుతామేమో కానీ అంతకు పదిరెట్లు ఒత్తిడికి గురవడం వల్ల నష్టమే అధికం. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని భావించి అప్పుడేం చెయ్యాలో ప్లాన్- బి ఉంటే అభ్యర్థులు చాలా ఉపశమనం పొందుతారు. ఫలితంగా విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అయితే...‘ప్లాన్-బి ఉంది కదా’ అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది సుమా!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
World News
Mental fatigue: మానసిక అలసటకు తీవ్ర ఆలోచనలే కారణమా!
-
Politics News
Munugode: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది: రాజగోపాల్‌రెడ్డి
-
India News
Eknath Shindhe: శిందే కేబినెట్లో 75% మంత్రులు నేరచరితులే.. అత్యంత ధనిక మంత్రి ఎవరంటే..?
-
General News
CM Kcr: సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన ముగ్గురు అక్కలు, చెల్లెలు
-
Sports News
Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!