మెరుగైన మార్కులు ఎలా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ప్రకటన వెలువడింది. ప్రభుత్వం నిర్వహించే వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల్లో (ప్రైవేటుతోసహా) టీచరుగా స్థిరపడాలనుకునేవారికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.

Published : 16 Jun 2022 02:17 IST

ఏపీ టెట్‌ 2022

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ప్రకటన వెలువడింది. ప్రభుత్వం నిర్వహించే వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల్లో (ప్రైవేటుతోసహా) టీచరుగా స్థిరపడాలనుకునేవారికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కులతో 20 శాతం వెయిటేజిని ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఇస్తారు. కాబట్టి సహజంగానే పోటీ ఎక్కువే ఉంటుంది. ఈ పరీక్ష ప్రాధాన్యం గుర్తించి అభ్యర్థులు సన్నద్ధతను కొనసాగించాలి!

న్‌లైన్‌ ద్వారా కంప్యూటర్‌ ఆధారిత టెట్‌ను ఆగస్టులో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన పట్టణాల్లో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21 వరకు రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షను నిర్వహిస్తారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఒడిశాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది.  


పరీక్ష స్వరూపం

ఏపీ టెట్‌లో 2 పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు.

పేపర్‌-1: 1 నుంచి 5 తరగతులకి బోధించడానికి అర్హత సాధించాలి.

పేపర్‌ 2: 6 నుంచి 8 తరగతులకి బోధించడానికి అర్హత పొందాలి.
(భాషా పండితులతోసహా).

గరిష్ఠ సమయం, మార్కులు: 150 నిమిషాలు. ప్రతి పేపరులో 150 మార్కులు.


అర్హతలు

పేపర్‌-1: పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్‌/ 10+2 లేదా తత్సమాన అర్హతతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులు (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్‌) కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

10+2 అర్హతతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ 4 సంవత్సరాల బీఈఎల్‌ఈడీ/బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉండాలి.

పేపర్‌-2: అభ్యర్థులు తమ బ్యాచిలర్స్‌ డిగ్రీని (బీఏ/బీకాం/బీఎస్సీ) కనీసం 50 మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్‌ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. భాషా పండిత అభ్యర్థులు కూడా 6 నుంచి 8 తరగతులు బోధించడానికి ఈ పేపరులో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే బీఈడీ/ బీఈడీ (స్పెషల్‌ ఎడ్యకేషన్‌/ నాలుగు సంవత్సరాల బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తుర్ణులై, 50 శాతం మార్కులు సాధించాలి. రిజర్వుడ్‌ కేటగిరి అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి.

గమనిక: పేపర్‌ 1(బి), పేపర్‌-2(బి) పరీక్షలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉండాలి. ఆ డిగ్రీలకు ఆర్‌సీఐ గుర్తింపు అవసరం.

టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్కు జీవితకాలం చెల్లుబాటు ఉంటుంది.

దరఖాస్తు గడువు: 16.06.2022 నుంచి 16.07.2022 వరకు.

వెబ్‌సైట్‌: http:/cse.ap.gov.in

పరీక్ష రుసుము: ప్రతి పేపర్‌కు రూ.500.


సన్నద్ధత ఎలా?

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన ఏపీ టెట్‌ సిలబస్‌ను పూర్తిగా అభ్యసించి, అర్థం చేసుకోవాలి.

* సిలబస్‌లోని ఏయే చాప్టర్ల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవలసి ఉందనే విషయం అభ్యర్థి తన బలాలు, బలహీనతల ఆధారంగా పరీక్షించుకోవాలి. ఆపై సన్నద్ధతను కొనసాగించాలి.

* గత పరీక్షల ప్రశ్నపత్రాలు విశ్లేషించుకుని ఎక్కువ ప్రాధాన్యం ఉన్న అధ్యాయాలు, భావనలు మొదలైనవి తెలుసుకుని, వాటిపై పట్టు సాధించాలి.

* సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణికమైన మెటీరియల్‌ను సేకరించుకోవడం, అవసరమైన విషయాలను అభ్యసిస్తూ సాధన చేయడం చాలా అవసరం.

* కష్టతరమైన అంశాలకు, భావనలకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. వాటిని నేర్చుకుంటూ పూర్తి పట్టు సాధించాలి.

* ఏ సబ్జెక్టుకైనా తగినంత సమయం కేటాయించుకుని అధ్యయనం కొనసాగించాలి.

* పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకుంటూ, స్వీయ అభ్యసనం కొనసాగిస్తూ, నిర్దేశించిన సమయంలో సమాధానాలు రాసేలా సాధన చేయాలి.

* కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మంచి మార్కులు పొందేవిధంగా ప్రయత్నించాలి.

* చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజికి తెలుగు అకాడమీ పుస్తకాలను, వీడియో పాఠాలను అనుసరించాలి.

* క్లిష్టమైన భావనలను ఆకళించుకుని విశ్లేషణాత్మకంగా, తరగతి గది సమస్యలకు అన్వయిస్తూ సాధన సాగాలి.

* మెథడాలజీకి తెలుగు అకాడమీ సిలబస్‌ను అనుసరించాలి.  

* ఆంగ్ల మాధ్యమంలో చదివిన అభ్యర్థులు తెలుగు కంటెంట్‌కు, వ్యాకరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* తెలుగు మాధ్యమంలో చదివిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి అభ్యసించాలి.

* పరీక్షలో ప్రతి మార్కూ విలువైనదే. అందుకని అన్ని సబ్జెక్టుల మీదా దృష్టి కేంద్రీకరించి సాధనచేయాలి.

* నిరంతర ప్రేరణ, అభ్యసనం, సాధన, రెమిడియల్‌ లెర్నింగ్‌ (నివారణాత్మక అభ్యసనం) చేస్తూ, ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలి.


పరీక్ష విధానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని