కోల్‌ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్‌-2022 స్కోరు ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు...

Published : 23 Jun 2022 00:36 IST

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీ

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్‌-2022 స్కోరు ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా ఎంపికైన అభ్యర్థులను కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థలూ, బొగ్గు గనుల్లో ఎక్కడైనా నియమించవచ్చు. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధపడి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో రూ.50,000 మూలవేతనం, ఇతర ఆలవెన్సులు అందుకుంటారు. ఏడాది శిక్షణ పూర్తిచేసుకుని, పరీక్ష పాసైనవారు రూ.60,000 మూలవేతనం, ఆలవెన్సులు పొందుతారు.
ఎంపికైనవారు ఐదేళ్లపాటు తప్పనిసరిగా పనిచేయాలి. ఇందుకోసం ఉద్యోగంలో చేరే సమయంలో రూ.3 లక్షలకు ఒప్పందపత్రాన్ని సమర్పించాలి.

మైనింగ్‌ విభాగంలో 699, సివిల్‌లో 160, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌లో 124, సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ విభాగంలో 67 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: మైనింగ్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ విభాగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు... సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ విభాగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ లేదా ఎంసీఏ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. జనరల్‌ (అన్‌ రిజర్వుడ్‌), ఓబీసీ (నాన్‌-క్రీమీ లేయర్‌), ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్స్‌ (ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులు సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

2021-2022 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే 31.08.2022 నాటికి తుది పరీక్ష ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తారు.


పోస్టుల కేటాయింపు

మొత్తం 1050 ఖాళీల్లో.. జనరల్‌కు 444, ఈడబ్ల్యూఎస్‌కు 105, ఎస్సీలకు 148, ఎస్టీలకు 81, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 272 పోస్టులు ఉన్నాయి.

మైనింగ్‌ విభాగంలో 699 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో జనరల్‌(యుఆర్‌)కు 295, ఈడబ్ల్యూఎస్‌కు 70, ఎస్సీలకు 98, ఎస్టీలకు 55, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 181 కేటాయించారు.

సివిల్‌ విభాగంలో 160 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో జనరల్‌ (యుఆర్‌)కు 71, ఈడబ్ల్యూఎస్‌కు 16, ఎస్సీలకు 21, ఎస్టీలకు 12, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 40 కేటాయించారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో 124 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌ (యుఆర్‌)కు 52, ఈడబ్ల్యూఎస్‌కు 12, ఎస్సీలకు 18, ఎస్టీలకు 9, ఓబీసీలకు 33 కేటాయించారు.

సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ విభాగంలో 67 ఖాళీలున్నాయి. జనరల్‌ (యుఆర్‌)కు 26, ఈడబ్ల్యూఎస్‌లకు 7, ఎస్సీలకు 11, ఎస్టీలకు 5, ఓబీసీలకు (ఎన్‌సీఎల్‌) 18 పోస్టులను కేటాయించారు.

వయసు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 31.05.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ (నాన్‌-క్రీమీలేయర్‌)లకు గరిష్ఠ వయఃపరిమితిలో 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులకు(జనరల్‌) 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్‌-క్రీమీలేయర్‌)లకు- 13, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు -15 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ (యుఆర్‌)/ ఓబీసీ (క్రీమీ లేయర్‌ అండ్‌ నాన్‌-క్రీమీ లేయర్‌)/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఫీజు రూ.1180ను ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం/కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు, గరిష్ఠ వయఃపరిమితి లేదు.

ఎంపిక: అభ్యర్థులను గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)-2022) మెరిట్‌ స్కోరు/మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్‌-2021 లేదా అంతకుముందు సంవత్సరాల్లో సాధించిన స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు.

రిజర్వేషన్లు: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్‌-క్రీమీ లేయర్‌), పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌/ఈఎస్‌ఎం అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని