డీఆర్డీవోలో సైంటిస్ట్ ‘బి’ కొలువులు
న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీవో - రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (DRDO-RAC) సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఏడీఏ (ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి వివరాలు పరిశీలిస్తే..
మొత్తం ఖాళీలు: 630 * డీఆర్డీవో-579 * ఏడీఏ-43 * డీఎస్టీ-8
ఖాళీలున్న విభాగాలు..
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
వయః పరిమితి: 28 - 35 ఏళ్లు.
అర్హత: పోస్టును బట్టి స్పెషలైజేషన్‌తో కూడిన బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉండాలి. గేట్ పరీక్షలో తగిన స్కోరు లేదా ఐఐటీ - ఎన్ఐటీ పట్టభద్రులైతే 80 శాతం మార్కులు ఉండాలి. అర్హతలను బట్టి అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించారు. తాము ఏ కేటగిరీకి చెందుతారో అభ్యర్థులు చూసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోరు, రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ముఖాముఖి పరీక్షకు పిలుస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అప్లికేషన్ లింక్ తెరుచుకున్న 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
రాతపరీక్ష తేదీ: అక్టోబర్ 16
పరీక్ష..
రాత పరీక్షలో మొత్తం రెండు ప్రశ్నపత్రాలుంటాయి. ప్రతిదానికీ 300 మార్కులు. ఒక్కో పేపర్‌నూ 3 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌నే దీనికీ అమలు చేస్తున్నారు. పూర్తిగా వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎంచుకున్న విభాగానికి సంబంధించి ప్రశ్నలు ఇస్తారు. అందువల్ల సంబంధిత సబ్జెక్ట్‌లో లోతైన అవగాహన తప్పనిసరి. ఐఈఎస్ పాతప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగం.
* ఈ పరీక్ష తీరు అకడమిక్ పరీక్షలకు దగ్గరగా ఉంటుంది. డిస్క్రిప్టివ్ విధానంలో చేతితో రాయడానికి తగిన సాధన అవసరం.
* ఇంటర్వ్యూకి 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. తుది నియామకాల్లో రాతపరీక్షకు 80%, ఇంటర్వ్యూకి 20% వెయిటేజీ ఉంటుంది.
https://ada.gov.in
www.dst.gov.in
స్థిరమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే రేపటి విజయానికి తొలిమెట్టు
- టోనీ రాబిన్స్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)