నేర్పిస్తాం.. నగదూ ఇస్తాం!

సబ్జెక్టు పరిజ్ఞానం, మంచి మార్కులు అరచేతిలో ఉన్నా ఉద్యోగం కోసం వేచిచూసే యువత ఎక్కువే. కారణం- ప్రాక్టికల్‌ పరిజ్ఞానం లేకపోవడం.సంస్థల విషయానికొస్తే.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంచుకున్నా ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇవ్వక తప్పడం లేదు. దీంతో సమయం, పెట్టుబడి వృథా.ఈ రెండింటికీ పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది

Updated : 22 Aug 2019 01:18 IST

సబ్జెక్టు పరిజ్ఞానం, మంచి మార్కులు అరచేతిలో ఉన్నా ఉద్యోగం కోసం వేచిచూసే యువత ఎక్కువే. కారణం- ప్రాక్టికల్‌ పరిజ్ఞానం లేకపోవడం.

సంస్థల విషయానికొస్తే.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంచుకున్నా ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇవ్వక తప్పడం లేదు. దీంతో సమయం, పెట్టుబడి వృథా.

ఈ రెండింటికీ పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది అప్రెంటిసష్‌ిప్‌. అందుకే చాలా సంస్థలు దీనికి ప్రాముఖ్యాన్నిస్తున్నాయి. అప్రెంటిస్‌షిప్ల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని అందిస్తూనే.. వారిలో మెచ్చినవారిని ఉద్యోగులుగా స్వీకరిస్తున్నాయి!

ఒకవైపు బోధన, రెండోవైపు పనిని చేయించడం ద్వారా నేర్పడం..ఈ రెండింటి కలయికే అప్రెంటిసష్‌ిప్‌. దీనిలో విద్యార్థులకు తరగతి గది థియరీ బోధన కంటే నేరుగా నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. పైగా పరిశ్రమ నిపుణుల నుంచి నేర్చుకునే అవకాశం. నచ్చిన పరిశ్రమ తీరుతెన్నులను దగ్గర్నుంచి చూసి, తెలుసుకునే వీలు దీనిలో కనిపిస్తుంది. ఉద్యోగ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ ఏడాది ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ ప్రకారం- మన విద్యార్థులకు ఉద్యోగానికి సరిపడిన పరిజ్ఞానం, నైపుణ్యాలు 57% వరకూ మాత్రమే ఉంటున్నాయి. ఆచరణాత్మక నైపుణ్యాలు తగినంత లేకపోవడమే ఇందుకు కారణం. మన విద్యావ్యవస్థలో సబ్జెక్టు పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రయోగపూర్వకంగా నేర్చుకునేది చాలా తక్కువ. అందుకే ఎంపిక చేసుకున్నవారు ఎంత ప్రతిభావంతులు అయినప్పటికీ పని విషయానికొచ్చేసరికి వారికి సంబంధిత శిక్షణను ఇవ్వడం సంస్థలకు తప్పనిసరి అవుతోంది. ఇందుకు సంస్థలు ఎంతో సమయాన్నీ, డబ్బునూ వెచ్చించాల్సి వస్తోంది.

ఈ పరిస్థితిని అధిగమించడానికి చాలా సంస్థలు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రాక్టికల్‌ ఓరియెంటెడ్‌ ట్రైనింగ్‌లను రూపొందిస్తున్నాయి. స్కూలు స్థాయి నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయుల వరకు అప్రెంటిసష్‌ిప్‌లను అందిస్తున్నాయి. శిక్షణతోపాటు కొంత మొత్తంలో స్టైపెండ్‌నూ చెల్లిస్తున్నాయి.

లాభాలేంటి?

అప్లికేషన్‌ థియరీని నేరుగా ఉపయోగించడం ద్వారా విషయాన్ని త్వరగా అర్థం చేసుకునే వీలుంటుంది. నేరుగా అనుభవమున్నవారితో పనిచేస్తూ, వారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవచ్ఛు వృత్తిపరంగా ఏవైనా సందేహాలు ఎదురైనా వెంటనే ప్రాక్టికల్‌గా నివృత్తి చేసుకునే అవకాశం. ●ఉద్యోగ సంబంధిత మెలకువలను అలవరచుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభ వేతనం తక్కువే అయినప్పటికీ, అనుభవం, పరిశ్రమ పరిజ్ఞానం పరంగా రెజ్యూమెకు అదనపు బలాన్ని జోడించుకున్నట్లవుతుంది. పైగా ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అప్రెంటిస్‌షిప్లో భాగంగా పరిశ్రమ నిపుణులనూ, సీనియర్లనూ కలిసే వీలుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయి. చాలాసార్లు అప్రెంటిస్‌షిప్ అందించిన సంస్థే ఉద్యోగావకాశాన్నీ ఇస్తోంది.

ఫోక్స్‌వాగన్‌

కాలవ్యవధి: మెకానిక్‌ మెకట్రానిక్స్‌- మూడేళ్లు, వెల్డింగ్‌- రెండేళ్లు.

ఇది ముఖ్యంగా రెండు విభాగాలు- మెకానిక్‌ మెకట్రానిక్స్‌, వెల్డింగ్‌ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని అందిస్తోంది. రెండింటికీ పదోతరగతి పూర్తయిన వారు అర్హులు. మెకానిక్‌ మెకట్రానిక్స్‌కు పదో తరగతి మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో 70% మార్కులు సాధించి ఉండాలి.

ఎవరు అర్హులు: పదో తరగతిలో 60% మార్కులుండాలి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆటోమొబైల్‌ పరిశ్రమలో జర్మన్‌ టెక్నాలజీ ఆధారంగా వస్తున్న కొత్త మెషినరీల గురించి తెలుసుకుంటారు. స్టైపెండ్‌ ఇస్తారు. సాధారణంగా వీటి ఎంపికకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి ఒకటి నుంచి రెండుసార్లు విడుదలవుతుంటాయి.

నమోదు ఎలా: తమ సీవీతోపాటు స్కూల్‌ సర్టిఫికెట్‌ కాపీలను ఈ-మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఎంపిక చేసినవారికి రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

https://www.volkswagen.co.in/en/about/apprentice-program.html

విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌

కాలవ్యవధి: ఏడాది

గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, టెక్నికల్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్లను అందిస్తోంది.

ఎవరు అర్హులు: ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జీ, ప్రొడక్షన్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా 65% మార్కులతో ఉత్తీర్ణులైనవారు, డిగ్రీ (బీఎల్‌ఐఎస్‌సీ/ కేటరింగ్‌ టెక్నాలజీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌) కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు ఏటా వీటి ప్రకటనలు విడుదలవుతుంటాయి.

నమోదు ఎలా: ఆసక్తి ఉన్నవారు సంసథ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్ఛు వెబ్‌సైట్‌: www.vssc.gov.in/

బాష్‌

కాలవ్యవధి: ఏడాది

ఈ సంస్థ ‘గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. చేయడం ద్వారా నేర్చుకోవడం దీనిలో భాగం. వివిధ విభాగాల్లో పనిచేసే వీలు కల్పిస్తారు. రోజువారీ విధులు, ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశంతోపాటు నిపుణుల సలహాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వమూ ఉంటుంది. దీంతోపాటు తరగతి గది శిక్షణ ఉంటుంది.

ఎవరు అర్హులు: ఇంజినీరింగ్‌ - మెకానికల్‌ సంబంధిత బ్రాంచిలు (మెకానికల్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ సైన్స్‌, ఆటోమొబైల్‌, మెకట్రానిక్స్‌), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ చదివినవారు అర్హులు. అభ్యర్థులు రెగ్యులర్‌ విధానంలోనే చదివి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారూ అర్హులే. ప్రతి సెమిస్టర్‌/ ఏడాది మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేసుండాలి.

నమోదు ఎలా: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు వ్యక్తిగతంగానూ, కళాశాల ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్ఛు రాతపరీక్ష, టెక్నికల్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

https://www.bosch.inareerstudents-and-graduates/graduate-apprentice/

తాజా ప్రకటనలివీ!

సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ మెటలర్జికల్‌ లేబొరేటరీ

కాలవ్యవధి: ఏడాది

జంషెడ్‌పూర్‌లోని ఎన్‌ఎంఎల్‌.. ఎలక్ట్రికల్‌, మెకానిక్‌ రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, కార్పెంటర్‌ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్లను అందిస్తోంది. పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు.వయసు 14-25 ఏళ్ల మధ్య ఉండాలి. వాక్‌ఇన్‌/ ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. స్టైపెండ్‌ ఉంటుంది. ఆగస్టు 29, 2019న ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఇతర వివరాలకు చూడాల్సిన వెబ్‌సైట్‌: www.nmlindia.org

హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

కాలవ్యవధి: ఏడాది, రెండేళ్లు

ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, టర్నర్‌, క్రేన్‌ ఆపరేటర్‌ మొదలైన విభాగాల్లో మొత్తం 126 అప్రెంటిస్‌షిప్లను అందిస్తున్నారు. 8 నుంచి 10, సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసినవారికి వీటిని అందించనున్నారు. వయసు జులై 1, 2019 నాటికి 14 నుంచి 40 లోపు ఉండాలి. మెరిట్‌ ఆధారిత ఎంపిక ఉంటుంది. అర్హులైనవారు http://hecltd.com/jobs-at-hec.php లో దరఖాస్తు చేసుకోవచ్ఛు దరఖాస్తు ఫీజు రూ.750. దరఖాస్తు చేసుకోవడానికి

ఆఖరి తేదీ: ఆగస్టు 26, 2019. విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ కూడా ఇస్తారు.

ఐఓసీఎల్‌

కాలవ్యవధి: ఏడాది

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్లను అందిస్తోంది.

ఎవరు అర్హులు: విభాగాలనుబట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ వరకూ ఎంచుకుంటున్నారు. రీజియన్లవారీగా ప్రకటనలు విడుదల చేసి ఎంచుకుంటుంటారు. 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని ఎంచుకుంటారు. స్టైపెండ్‌ ఉంటుంది.

నమోదు ఎలా: ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. www.iocl.com

ఎన్‌ఎస్‌డీసీ

కాలవ్యవధి: 6 నెలల నుంచి 36 నెలలు

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. లాభాపేక్ష లేని సంస్థ. తక్కువ మొత్తంలో తరగతి గది బోధన, ఎక్కువ ప్రాక్టికల్‌ శిక్షణ దీనిలో భాగం. మీడియా, రిటైల్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌, మాన్యుఫాక్చరింగ్‌, బ్యూటీ, బ్యాంకింగ్‌ ఇంకా ఎన్నో అంశాల్లో అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పిస్తోంది.

ఎవరు అర్హులు: పద్నాలుగు, ఆపై వయసున్న వారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్ఛు అయిదో తరగతి కనీస విద్యార్హత. పరిశ్రమ నిపుణులు బోధిస్తారు. స్టైపెండ్‌ చెల్లిస్తారు. అప్రెంటిస్‌షిప్ పూర్తయ్యాక ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఎంచుకున్న విభాగం, విద్యార్హతలను బట్టి ప్రోగ్రామ్‌ వ్యవధి ఆధారపడి ఉంటుంది.

నమోదు ఎలా: ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు https://nsdcindia.org/

భారతీయ రైల్వేలు సాంకేతిక ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం పోస్టులను అప్రెంటిస్ షిప్ పూర్తిచేసిన వారికి కేటాయిస్తున్నాయి. జనవరి, 2019లో వెలువడిన లెవెల్‌-1 లక్ష పోస్టుల్లో ఇరవై వేల ఖాళీలను వారితోనే భర్తీ చేయనున్నాయి.

(మరికొన్ని సంస్థలు అందిస్తున్న అప్రెంటిస్‌షిప్ వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు)

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని