ఒకటే పరీక్ష..18 సంస్థల్లోకి ప్రవేశం!

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ,  రిసెర్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి  నిర్వహించే సీయూ సెట్‌ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు 4 రాష్ట్రస్థాయి సంస్థలు అందిస్తున్న కోర్సుల్లో చేరడానికి వీలవుతుంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో విస్తృతంగా ఉన్న రకరకాల కోర్సుల్లో చేరటానికి సీయూ సెట్‌ స్కోరు ఉపయోగపడుతుంది....

Updated : 23 Dec 2022 16:51 IST

సీయూ సెట్‌ - 2020

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ,  రిసెర్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి  నిర్వహించే సీయూ సెట్‌ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు 4 రాష్ట్రస్థాయి సంస్థలు అందిస్తున్న కోర్సుల్లో చేరడానికి వీలవుతుంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో విస్తృతంగా ఉన్న రకరకాల కోర్సుల్లో చేరటానికి సీయూ సెట్‌ స్కోరు ఉపయోగపడుతుంది.
మ్యాథ్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌,    జువాలజీ, జర్నలిజం, ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌.. కోర్సు ఏదైనప్పటికీ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అన్ని సంస్థల్లోని సీట్లకూ పోటీ పడవచ్చు. ఈ కేంద్రీయ సంస్థలన్నీ ప్రమాణాలకు పేరుపొందినవే. ఇంటర్‌ అర్హతతో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా అందరూ పోటీ పడవచ్చు. మిగిలిన 4 రాష్ట్రస్థాయి సంస్థలకు స్థానిక రిజర్వేషన్లు వర్తిస్తాయి.
*యూజీ కోర్సులు
బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌: ఈ కోర్సులను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వ్యవధి నాలుగేళ్లు. ఈ విధానంలో చదువుకున్నవారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. బీఏ బీఎడ్‌ కోర్సుకు ఇంటర్‌ అన్ని గ్రూపుల వారు, బీఎస్సీ బీఎడ్‌కు మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వొకేషనల్‌ స్టడీస్‌: బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బయో మెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను వొకేషనల్‌ స్టడీస్‌లో భాగంగా అందిస్తున్నారు. వీటి వ్యవధి మూడేళ్లు. వీటిలో చేరడానికి ఇంటర్‌  అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంటుంది.
బీఏ: చైనీస్‌, జర్మన్‌ స్టడీస్‌, కొరియన్‌,  ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ సైన్స్‌ కోర్సులు. వీటికి ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ పోటీ పడవచ్చు. బీఏఎల్‌ఎల్‌బీ, బీబీఏ, బీసీఏ, బీపీఏ మ్యూజిక్‌ కోర్సులూ ఉన్నాయి.

 

బీఎస్సీ: ఎకనామిక్స్‌, జాగ్రఫీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, సైకాలజీ, టెక్స్‌టైల్‌ కోర్సులు. వీటిలో కొన్నింటికి అన్ని గ్రూపుల విద్యార్థులూ పోటీ పడవచ్చు. మిగిలినవాటికి ఇంటర్‌లో ఆ సబ్జెక్టు చదివి ఉండాలి.  
బీటెక్‌: సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశం పరీక్షలో చూపిన ప్రతిభతో             లభిస్తుంది.
డిప్లొమా, సర్టిఫికెట్‌: బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. వీటికి ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ పోటీ పడవచ్చు.
* పీజీలు
ఎంబీఏ: ఇందులో జనరల్‌ కోర్సుతోపాటు వివిధ స్పెషలైజేషన్లను సంస్థలు అందిస్తున్నాయి. అగ్రి బిజినెస్‌, అపారెల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌..మొదలైనవి ఉన్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.
ఎమ్మెస్సీ: ఆంత్రోపాలజీ, అప్లయిడ్‌ జియోగ్రఫీ అండ్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌, అప్లయిడ్‌ జియాలజీ, అప్లయిడ్‌ సైకాలజీ, అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌, బయో కెమిస్ట్రీ, బయో డైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, బయో సైన్స్‌ అండ్‌ బయో ఇన్ఫర్మాటిక్స్‌, బయోటెక్నాలజీ, బోటనీ, కెమికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, డిజిటల్‌ సెక్యూరిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎపిడమాలజీ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జీనోమిక్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియోఇన్ఫర్మాటిక్స్‌, జియాలజీ, హార్టికల్చర్‌, హ్యూమన్‌ జెనెటిక్స్‌,
ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లైఫ్‌ సైన్స్‌, మెటీరియల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, మ్యాథ్స్‌, మైక్రోబయాలజీ, మాలిక్యులర్‌ మెడిసిన్‌, నానో టెక్నాలజీ, న్యూట్రిషన్‌ బయాలజీ, ఫిజిక్స్‌, స్పోర్ట్స్‌ బయోకెమిస్ట్రీ, స్పోర్ట్స్‌ ఫిజియాలజీ, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, స్పోర్ట్స్‌ సైకాలజీ, స్టాటిస్టిక్స్‌, యోగ, యోగ థెరపీ, జువాలజీ .. తదితర కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశానికి సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును యూజీ స్థాయిలో చదవడం తప్పనిసరి.
ఎంఏ: ఆంత్రపాలజీ, అప్లైడ్‌ క్రిమినాలజీ అండ్‌ పోలీస్‌ స్టడీస్‌, చైనీస్‌, క్లాసికల్‌ తమిళ్‌ స్టడీస్‌,  కంపారిటివ్‌ రెలిజియన్‌, కన్వర్జెంట్‌ జర్నలిజం,  క్రిమినల్‌ లా, కల్చరల్‌ ఇన్ఫర్మాటిక్స్‌, కల్చర్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ట్రైబల్‌ స్టడీస్‌, జర్మన్‌ స్టడీస్‌, గుజరాతీ, హిందీ, హిస్టరీ, ఇస్లామిక్‌ స్టడీస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, కన్నడ, లింగ్విస్టిక్స్‌, మలయాళం, నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌, ఒడియా, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంజాబీ, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ. వీటిలో చాలా కోర్సులకు సాధారణ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలినవాటికి యూజీలో సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టు చదివుండాలి.
ఎంకాం, ఎల్‌ఎల్‌ఎం, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, ఎంపీఈడీ, ఎంపీఏ, ఎంఫార్మ్‌, ఎంసీఏ కోర్సులు పలు సంస్థల్లో అందిస్తున్నారు.

ఎంటెక్‌: ఆక్వాకల్చరల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎనర్జీ ఇంజినీరింగ్‌, పవర్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెటీరియల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, వీఎల్‌ఎస్‌ఐ, నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పవర్‌ అండ్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, వాటర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.. బీటెక్‌లో సంబంధిత లేదా అనుబంధ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభతో  ప్రవేశాలు కల్పిస్తారు.
పీజీ డిప్లొమా: ఆల్టర్నేట్‌ బ్యాంకింగ్‌, కెమికల్‌ లేబొరేటరీ టెక్నీషియన్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌, మీడియా రైటింగ్‌ అండ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌, ఎన్‌ఆర్‌ఐ లాస్‌, పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్‌ స్టడీస్‌..తదితర కోర్సులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎలా సిద్ధం కావాలి?
యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ (మల్టిపుల్‌ ఆప్షన్స్‌) తరహాలో వస్తాయి. మొత్తం వంద ప్రశ్నలు రెండు విభాగాల్లో అడుగుతారు. పార్ట్‌- ఎలో 25 ప్రశ్నలు లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మ్యాథమేటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌ నుంచి వస్తాయి. పార్ట్‌- బిలో సంబంధిత విభాగానికి చెందిన 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 3 లేదా 4 లేదా 5 సెక్షన్లుగా విభజించి అడుగుతారు. ప్రతి సెక్షన్‌లోనూ 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇందులో కనీసం 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. కొన్ని సబ్జెక్టులు, జనరల్‌ కోర్సుల్లో నిర్వహించే పరీక్షలకు మొత్తం వంద ప్రశ్నలు ఒకే సెక్షన్‌ కింద అడగవచ్చు. ఈ తరహా ప్రశ్నపత్రాల్లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌, డేటా ఇంటర్‌ ప్రిటేషన్స్‌ లేదా న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈకి సంసిద్ధులైవుంటారు కాబట్టి పార్ట్‌-బి విభాగం సిలబస్‌ వారికి సుపరిచితమే. (ప్రశ్నలు జేఈఈ మెయిన్‌ స్థాయిలో ఉండవచ్చు). కాబట్టి విద్యార్థుల పార్ట్‌-ఎ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. డిగ్రీ విద్యార్థులు తమ సబ్జెక్టుల్లో డిగ్రీ స్థాయి సిలబస్‌ను క్షుణ్ణంగా చదవాలి. డిగ్రీ సిలబస్‌తో సీయూ సెట్‌ను పోల్చి చూసుకుని అదనపు అంశాలను రిఫరెన్స్‌ పుస్తకాలు, ఆన్‌లైన్‌ సమాచారం ఆధారంగా అధ్యయనం చేయాలి.
రిసెర్చ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులోనూ రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-ఎలో 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌, రిసెర్చ్‌ మెథడాలజీల నుంచి అడుగుతారు. పార్ట్‌-బిలో 50 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టు నుంచి వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు.


* ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:  ఏప్రిల్‌ 11, 2020.
పరీక్షలు: దరఖాస్తు చేసుకున్న కోర్సు ప్రకారం మే 30, 31; జూన్‌ 6, 7 తేదీల్లో.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, పలాస.  
వెబ్‌సైట్‌:
https:// cucetexam.in/


* ఇంటిగ్రేటెడ్‌/ డ్యూయల్‌ డిగ్రీ పీజీ
ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంసీఏ: ఈ కోర్సుల వ్యవధి అయిదేళ్లు. ఇంటర్‌ విద్యార్హతతో వీటిని అందిస్తున్నారు. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, సోషల్‌ మేనేజ్‌మెంట్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, ఎంసీఏ కోర్సులు ఇంటిగ్రేటెడ్‌ లేదా డ్యూయల్‌ డిగ్రీ విధానంలో ఉన్నాయి. కొన్నింటికి అన్ని గ్రూపుల వారు, మిగిలినవాటికి ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టు చదువుకున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంఫిల్‌, పీహెచ్‌డీ
దాదాపు అన్ని కోర్సులు, విభాగాల్లోనూ ఎంఫిల్‌, పీహెచ్‌డీ అందిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ చదివినవారు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని