కొలువులకు ఎండీఎస్‌ఎల్‌ ఆహ్వానం!

ముంబయిలోని ప్రభుత్వరంగ సంస్థ మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌)

Published : 24 Jun 2021 11:08 IST

ముంబయిలోని ప్రభుత్వరంగ సంస్థ మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ప్రకటించిన ఖాళీలు 1388. ఏసీ మెకానిక్, కంప్రెషర్‌ అటెండెంట్,    కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫ్యాబ్రికేటర్,  ఎలక్ట్రీషియన్, పెయింటర్‌ మొదలైన ఉద్యోగాలున్నాయి. 
అర్హులైన దరఖాస్తుదారులకు జులై నెలాఖరులో ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో తెచ్చుకున్న మార్కులూ, అనుభవానికి కేటాయించిన మార్కుల ఆధారంగా ట్రేడ్‌ టెస్టుకు పిలుస్తారు. ట్రేడ్‌ టెస్ట్‌ సమయంలో అభ్యర్థుల డాక్యుమెంట్ల పరిశీలన ఉంటుంది. రాతపరీక్ష, అనుభవం, ట్రేడ్‌ టెస్టుల్లో సాధించిన ఉమ్మడి మార్కుల ఆధారంగా తుది మెరిట్‌ జాబితాను తయారుచేసి, అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 
జీతభత్యాలు: నెలకు రూ. 17,000 నుంచి రూ. 64,360 వరకు (స్కిల్డ్‌ గ్రేడ్‌-1), రూ.13,200 నుంచి రూ.49910 (సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌-1) వరకు చెల్లిస్తారు. 
- ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ఈ-రిసీట్, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీలను తీసుకోవాలి. ఎంపిక సమయంలో వీటిని సమర్పించాల్సి ఉంటుంది.
- ట్రేడ్‌ టెస్ట్‌కు ఇతర ప్రాంతాల నుంచి హాజరైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ప్రయాణ చార్జీలను చెల్లిస్తారు. డాక్యుమెంట్ల పరిశీలనలో అనర్హులుగా తేలిన అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులను ఇవ్వరు. 
- ఆన్‌లైన్‌ పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఫలితాలను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. టెస్ట్‌ సెంటర్‌ను మార్చడం, క్యాన్సిల్‌ చేసే విషయంలో పూర్తి నిర్ణయాధికారం సంస్థదే. కెమెరా/ కెమెరా ఉన్న మొబైల్‌ ఫోన్లను సంస్థ ప్రాంగణంలోకి అనుమతించరు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. 
వయసు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 18 నుంచి 38 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌ ఉన్నవారికి వయః పరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 04.07.2021
వెబ్‌సైట్‌:  https://mazagondock.in
ఏ పోస్టుకు ఏ అర్హతలుండాలి?
1. ఏసీ రెఫ్రిజిరేషన్‌ మెకానిక్‌ 05: ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్ష, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత. 
2. కంప్రెషర్‌ అటెండెంట్‌ 05: ఎస్‌ఎస్‌సీ, ఎన్‌ఐసీ పరీక్ష ఉత్తీర్ణత.
3. కార్పెంటర్‌ 81: 8వ తరగతి, జాతీయ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత.
4. చిప్పర్‌ గ్రైండర్‌ 13: ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత,  సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏడాది అనుభవం.
5. కాంపోజిట్‌ వెల్డర్‌ 132: 8వ తరగతి, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత. 
6. డీజిల్‌ క్రేన్‌ ఆపరేటర్‌ 05: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (డీజిల్‌ మెకానిక్‌) ఉత్తీర్ణత.
7. డీజిల్‌ కమ్‌ మోటార్‌ మెకానిక్‌ 04: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష (డీజిల్‌ మెకానిక్‌/ ఎంవిఎం/ మెకానిక్‌ డీజిల్‌/ మెకానిక్‌) ఉత్తీర్ణత. 
8. జూనియర్‌ డ్రాఫ్ట్స్‌మన్‌ (మెకానికల్, సివిల్‌) 54: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష (డ్రాఫ్ట్ట్‌మన్‌ - సివిల్, మెకానికల్‌) ఉత్తీర్ణత.
9. ఎలక్ట్రీషియన్‌ 204: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత.
10. ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 55: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత.
11. ఫిట్టర్‌ 119: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత.
12. జూనియర్‌ ప్లానర్‌ ఎస్టిమేటర్‌ (మెక్, ఎలెక్ట్‌) 08: ఎస్‌ఎస్‌సీ/ హెచ్‌ఎస్‌సి, డిప్లొమా/ డిగ్రీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
13. జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌ (మెకానికల్‌) 13: ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా (మెకానికల్‌/ షిప్‌ బిల్డింగ్‌ / (మెరైన్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
14. గ్యాస్‌ కట్టర్‌ 38: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష ఉత్తీర్ణత.
15. మెషినిస్ట్‌ 28: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (మెషినిస్ట్‌) ఉత్తీర్ణత.
16. మిల్‌రైట్‌ మెకానిక్‌ 10: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష (మిల్‌ రైట్‌ మెకానిక్‌ / మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌) ఉత్తీర్ణత.
17. పెయింటర్‌ 100: 8వ తరగతి, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పరీక్ష (పెయింటర్‌ / మెరైన్‌ పెయింటర్‌) ఉత్తీర్ణత. 
18. పైప్‌ ఫిట్టర్‌ 140: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (పైప్‌ ఫిట్టర్‌/ ప్లంబర్‌) ఉత్తీర్ణత.
19. రిగ్గర్‌ 88: 8వ తరగతి. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (రిగ్గర్‌) ఉత్తీర్ణత. 
20. స్ట్రక్చరల్‌ ఫ్యాబ్రికేటర్‌ 125: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ అప్రెంటిస్‌ షిప్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌/ ఫ్యాబ్రికేటర్‌) ఉత్తీర్ణత.
21. స్టోర్‌ కీపర్‌ 10: ఎస్‌ఎస్‌సీ/ హెచ్‌ఎస్‌సీ, డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
22. యుటిలిటీ హ్యాండ్‌ 14: యుటిలిటీ హ్యాండ్‌ (స్కిల్డ్‌) ఫిట్టర్‌ ట్రేడ్‌ నుంచి మాత్రమే ఎంపిక చేస్తారు. రెండు నెలల శిక్షణ ఇస్తారు. 
23. పారామెడిక్స్‌ 02: ఇంటర్మీడియట్, డిప్లొమా/ డిగ్రీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. 
24. యుటిలిటీ హ్యాండ్‌ 135 (సెమీ స్కిల్డ్‌) : ఎస్‌ఎస్‌సీ, షిప్‌బిల్డింగ్‌ పరిశ్రమలో యుటిలిటీ హ్యాండ్‌గా అనుభవం ఉండాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని