కెరియర్‌కి ఏ కోర్సు మేలు?

మీ విద్యార్హత, ఉద్యోగానుభవంతోపాటు, భవిష్యత్‌ ప్రణాళికకు అనుగుణంగా ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోండి.

Updated : 11 Jan 2022 12:18 IST

నేనొక ప్రముఖ సంస్థలో అసోసియేట్‌గా పనిచేస్తున్నాను. పవర్‌ బీఐ, మ్యూల్‌సాఫ్ట్‌.. ఈ రెండు కోర్సుల్లో ఏది చేస్తే నా కెరియర్‌కి ఉపయోగం?

- సతీష్‌ 

మీ విద్యార్హత, ఉద్యోగానుభవంతోపాటు, భవిష్యత్‌ ప్రణాళికకు అనుగుణంగా ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోండి. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ అనేది ఒక డేటా విజువలైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌. ఇది ముఖ్యంగా బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ కోసం ఉపయోగపడే ప్రముఖ సాధనం. డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పవర్‌ బీఐలో శిక్షణ పొందాక ప్రముఖ ఐటీ కంపెనీల్లో, బిజినెస్‌ అనలిటిక్స్‌ కంపెనీల్లో పవర్‌ బీఐకి సంబంధించిన డేటా అనలిస్ట్, డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్‌ హోదాల్లో సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనం పొందవచ్చు. 

ఈ రంగంలో రాణించాలంటే  బీఎస్సీ ( డేటా సైన్స్‌/ మేథమ్యాటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌)/బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ/బీబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌)/ ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) లాంటి విద్యార్హతలు అవసరం. ఇక మ్యూల్‌సాఫ్ట్‌ విషయానికొస్తే, ఇది అప్లికేషన్, డేటా, డివైస్‌లను ఇంటిగ్రేషన్‌ చేసే సాఫ్ట్‌వేర్‌. మ్యూల్‌సాఫ్ట్‌లో ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అనేది ముఖ్యమైంది. దీన్ని ఉపయోగించి అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ డెవలపర్స్‌ వివిధ రకాల అప్లికేషన్లు వృద్ధి చేస్తారు. మ్యూల్‌సాఫ్ట్‌లో శిక్షణ పొందినవారు ప్రముఖ ఐటీ కంపెనీల్లో మ్యూల్‌సాఫ్ట్‌కు సంబంధించి ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అప్లికేషన్‌ డెవలపర్స్, ఇంటిగ్రేషన్‌ మేనేజర్, డెవలపర్, మాడ్యూల్‌ లీడ్, సాఫ్ట్‌వేర్‌ 

ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాలు, ఏడాదికి 

రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వేతనంతో పొందే అవకాశం ఉంది. మ్యూల్‌సాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మంచి ఉద్యోగం పొందాలనుకొంటే- బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ లాంటి విద్యార్హతలు అవసరం. పైన చెప్పిన పవర్‌ బీఐ, మ్యూల్‌సాఫ్ట్‌లకు సంబంధించిన ఉద్యోగాల్లో అభ్యర్థుల ఉద్యోగానుభవాన్ని బట్టి ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంటుంది. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని