నింగిని చదివేద్దాం!
చిన్నప్పుడు అమ్మ చందమామను చూపిస్తూ బువ్వ పెడుతుంది.. కాస్త పెద్దయ్యాక తళుక్కున మెరిసే తారలు మనల్ని మరింత ఆకర్షిస్తాయి. అసలు ఆ వినీలాకాశంలో ఏముంది? అనంత విశ్వంలో జరిగేదేంటి? అనే ప్రశ్నలు ఉదయించని పసితనమే ఉండదు. ఆ ఆసక్తికి జవాబులిచ్చేలా, చక్కని భవితకు బాటలు వేసేలా మనమూ దాని గురించి అధ్యయనం చేయొచ్చు.
ఖగోళ పరిశోధనలు విస్తృతమైన ఈ రోజుల్లో ఖగోళభౌతిక శాస్త్రం చదివిన వారికీ అంతే డిమాండ్ పెరిగింది. వైద్య, ఆర్థిక, తయారీరంగాల్లోనే కాక అంతరిక్ష రంగంలోనూ ఈ కోర్సు పూర్తి చేసినవారికి అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలున్నాయి. ప్రముఖ సంస్థలు ఆస్ట్రోఫిజిక్స్‌కి సంబంధించి ప్రత్యేకంగా డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ లాంటి పలు కోర్సులను అందిస్తున్నాయి. మరి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా!
కోర్సు రకాలు: యూజీ.. బీఎస్సీ: ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్, బి.టెక్: ఇంజినీరింగ్.
పీజీ.. ఎమ్మెస్సీ: ఆస్ట్రోనమీ, ఎంటెక్: ఆస్ట్రోనమీ అండ్ స్పేస్ ఇంజినీరింగ్.
డాక్టోరల్.. పీహెచ్.డీ: ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, అట్‌మాస్పియరిక్ సైన్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ.. పీహెచ్.డి: ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్,
ఎంటెక్.. పీహెచ్.డి: ఆస్ట్రోనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: యూజీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా చదివివుండాలి.
కాలవ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు).
పీజీ: సంబంధిత డిగ్రీ(బీఎస్సీ- ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్) లేదా నాలుగేళ్ల బి.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. 50-60 శాతం మార్కులతో పాసైనవారు అర్హులు.
పీహెచ్.డి: పీజీ స్థాయిలో రెండేళ్ల ఎమ్మెస్సీ ఫిజిక్స్/ ఆస్ట్రోనమీ/ ఆస్ట్రోఫిజిక్స్ లేదా ఎంటెక్ ఆస్ట్రోనమీ/ ఆస్ట్రోఫిజిక్స్ పూర్తి చేసి ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ: ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివినవారు అర్హులు.
ఏయే సబ్జెక్టులు: పదార్థం - స్థితి(ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్), విశేష సారూప్యత (స్పెషల్ రిలేటివిటీ), ఆసిల్లేషన్ ఆఫ్ వేవ్స్, ఫిజిక్స్ ఆఫ్ ఫీల్డ్ అండ్ మేటర్, ఆస్ట్రోఫిజిక్స్, ఆధునిక భౌతికశాస్త్రం, ప్రాక్టికల్ ఫిజిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఆస్ట్రోనామికల్ టెక్నిక్స్, పొజిషినల్ ఆస్ట్రోనమీ, క్వాంటమ్ మెకానిక్స్, కాస్మాలజీ మొదలైన సబ్జెక్టులు చదువుతారు.
ఇస్రో, డీఆర్‌డీవో, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బార్క్ వంటి పలు సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది!
కోర్సులు అందించే ప్రముఖ విద్యాసంస్థలు..
* ఆంధ్రా యూనివర్సిటీ - ఎమ్మెస్సీ(ఫిజిక్స్/స్పేస్ ఫిజిక్స్), ఎంటెక్(జియోఫిజిక్స్)
* ఉస్మానియా - ఎమ్మెస్సీ(ఆస్ట్రోనమి), (ఫిజిక్స్)
* మహాత్మాగాంధీ యూ।।- ఎమ్మెస్సీ(ఫిజిక్స్) * సావిత్రిభాయ్ ఫూలే యూ।।- ఎమ్మెస్సీ(ఫిజిక్స్/ అట్‌మాస్పియరిక్ ఫిజిక్స్), ఎంఫిల్(ఫిజిక్స్)
* పంజాబ్ యూ।।- బీఎస్సీ(ఫిజిక్స్), ఎమ్మెస్సీ (ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్) * ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) * బి.టెక్(ఫిజిక్స్- 4 సం।।), బి.టెక్-ఎంటెక్ డిగ్రీ(ఇంజినీరింగ్ ఫిజిక్స్- 5 సం।।), ఎమ్మెస్సీ(ఫిజిక్స్) * ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) * పీహెచ్.డి(ఫిజిక్స్), ఇంటిగ్రేటెడ్(ఫిజిక్స్)
* టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) - ఎమ్మెస్సీ, పీహెచ్.డి, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎంఫిల్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)- జాయింట్ ఆస్ట్రోనమీ, పీహెచ్.డి, ఇంటిగ్రేటెడ్ పీహెచ్.డి.
అడ్మిషన్లు: కొన్ని యూనివర్సిటీలు/ సంస్థలు ఇంటర్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నేరుగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు జిల్లా/ జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. పరీక్షలో అభ్యర్థి ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశపరీక్షలు..
యూజీ..
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఆర్)- బీఎస్- ఎంఎస్ ప్రోగ్రామ్‌ల కోసం పరీక్ష నిర్వహిస్తుంది.
2. బెనారస్ హిందూ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (బీహెచ్‌యూ)- ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ అందించే పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష.
3. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జస్ట్)- ఈ పరీక్షను ఫిజిక్స్/ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లకు మాత్రమే నిర్వహిస్తారు.
పీజీ
1. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీజెట్): ఈ పరీక్షను ఓయూ, ఓయూ అనుబంధ కాలేజీల్లో ప్రవేశపెట్టిన పలు పీజీ, పీజీ డిప్లోమా కోర్సులకు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
2. ఆంధ్రా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏయూసెట్): పీజీ స్థాయిలో పలు రకాల కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు ఏయూ నిర్వహించే ప్రవేశపరీక్ష ఏయూసెట్.
ఉద్యోగావకాశాలు: ఆస్ట్రోనాట్- (సుమారుగా 6 నుంచి 12 లక్షల వరకు వార్షిక వేతనం)
* ఆస్ట్రో ఫిజిసిస్ట్, అబ్జర్వేషనల్ ఆస్ట్రోనమర్, సోలార్ ఆస్ట్రోనమర్, స్టెల్లార్ ఆస్ట్రోనమర్, రీసెర్చర్, థియరిటికల్ ఆస్ట్రోఫిజిసిస్ట్, లెక్చరర్- (ఏడాదికి సుమారుగా రూ. 8- 10 లక్షలు వేతనం).
* రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్ - ఏడాదికి సుమారుగా రూ. 3.2 లక్షల వేతనం.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: 89 బంతుల్లోనే పంత్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
-
India News
Agnipath: ఆర్మీ, నేవీలో ‘అగ్నిపథ్’ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయ్..!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
-
General News
Telangana News: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి