Updated : 13 Jun 2022 06:38 IST

ఫిజియో కోర్సుల్లో ప్రామాణిక శిక్షణ

ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు

రుగ్మతలూ, నొప్పులూ, గాయాలూ బాధిస్తూ శారీరక కదలికలకు, దైనందిన కార్యకలాపాలకు అవరోధంగా మారితే ఉపశమనమిచ్చేది ఫిజియో థెరపీ. ఫిజియో కోర్సుల్లో శిక్షణ పొందినవారు ఈ విభాగంలో రాణించవచ్ఛు జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలు బీపీటీ, బీపీవో, బీవోటీ చదువులు అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఈ సంస్థలు కేంద్రంలోని సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అందువల్ల మేటి బోధనతోపాటు మెరుగైన వసతులు ఆశించవచ్ఛు కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం!

బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీవో), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ) కోర్సుల్లో ప్రవేశాలు జరపనున్నారు. ప్రతి కోర్సు వ్యవధీ నాలుగేళ్లు.మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఇవీ సంస్థలు...

1 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటివ్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఎల్‌డీ), కోల్‌కతా

2 స్వామీ వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్‌

3 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవరమెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై

4 పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజెబిలిటీస్‌, న్యూదిల్లీ

అర్హతలు

అన్ని కోర్సులకూ ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీపీవో కోర్సుకు ఎంపీసీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై సంస్థలోని బీపీటీ, బీవోటీ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులూ అర్హులే. ఏ కోర్సు, ఏ సంస్థకైనా జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మార్కుల శాతంలో సడలింపులు వర్తిస్తాయి.

వయసు: జనవరి 1, 2002 - డిసెంబరు 31, 2005 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ప్రశ్నపత్రంలో...

వంద మార్కులకు ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకటి చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎలో జనరల్‌ ఎబిలిటీ జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం నుంచి పది ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-బిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ తప్పనిసరిగా బయాలజీ/మ్యాథ్స్‌ ఐచ్ఛికంగా ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.

అన్ని సంస్థల్లోనూ కలిపి 551 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షను (ఎస్‌వీ ఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్‌ నిర్వహిస్తుంది.

పై మూడు కోర్సులనూ పీజీ స్థాయిలో ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌, కటక్‌ అందిస్తోంది. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. యూజీ స్థాయిలో సంబంధిత కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


యూజీ, పీజీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 25 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: జులై 24 (యూజీ, పీజీ రెండు కోర్సులకూ)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికిందరాబాద్‌, విజయవాడ

వెబ్‌సైట్‌: http://svnirtar.nic.in


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts