నమూనా పరీక్షలు రాస్తున్నారా?
ప్రవేశ పరీక్షల్లో, ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో అభ్యర్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవడానికి మాక్‌టెస్టులు (నమూనా పరీక్షలు) ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రాయటం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా...
* నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తిచేయగలుగుతున్నారో లేదో అర్థమవుతుంది. దానికి అనుగుణంగా సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే అసలు పరీక్షను నిర్ణీత సమయంలోనే ముగించగలుగుతారు.
* ప్రశ్నల తీరు, వాటి స్థాయి ఎలా ఉందనే విషయంలో స్పష్టత వస్తుంది. సన్నద్ధత స్థాయిని విశ్లేషించుకునే అవకాశమూ కలుగుతుంది.
* కొన్ని సెక్షన్లు రాయడానికి ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ సమయం పట్టొచ్ఛు దానికి అనుగుణమైన ప్రణాళికకు వీలవుతుంది.
* ఏ సెక్షన్లు క్లిష్టంగా, ఏవి సులువుగా ఉంటున్నాయో స్పష్టత వస్తుంది. దీంతో కష్టంగా ఉండే వాటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారు.
* ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు.. ఎన్ని మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు.. లాంటివన్నీ ముందుగానే తెలియడం వల్ల మరింత సమర్థంగా ప్రణాళిక వేసుకుని పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
* పరీక్షలంటే సాధారణంగా ఏ అభ్యర్థికైనా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. మాక్ టెస్టులు రాసిన అనుభవంతో అసలు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండగలుగుతారు. దీంతో పూర్తిసామర్థ్యంతో పరీక్ష రాయటం సాధ్యమవుతుంది!
మాక్ టెస్ట్ రాసే సమయంలో రకరకాల వ్యూహాలను ఆచరించవచ్ఛు అందులో నుంచి మీకు అనువైనదాన్ని ఎంచుకుని అసలు పరీక్ష సమయంలో అమలుచేయొచ్చు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
-
Crime News
Hyderbad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
-
Ts-top-news News
Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం