ఏయూలో.. డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికిగానూ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈ యూనివర్సిటీ... ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష (ఏయూఈఈటీ) ద్వారా అర్హులైన అభ్యర్థులకు బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ

Updated : 21 Jun 2022 00:56 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికిగానూ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈ యూనివర్సిటీ... ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష (ఏయూఈఈటీ) ద్వారా అర్హులైన అభ్యర్థులకు బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌ మోడ్‌)లను అందివ్వనుంది.

స్పెషలైజేషన్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ ఎంటెక్‌; బీటెక్‌ + ఎంటెక్‌... ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీలను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. కనీసం 40-45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు ఫీజు వివరాలు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌- ఏడాదికి రూ.2 లక్షలు, బీటెక్‌+ఎంటెక్‌- రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకూ ఉంటుంది.

సీట్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌ - 360; బీటెక్‌+ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)- 60; బీటెక్‌+ఎంటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- ఒక్కో విభాగానికి 30 చొప్పున)

ఎంపిక విధానం: ఏయూఈఈటీ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా...

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200/-, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకైతే రూ.1000/-.

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. అన్నింటిలో మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలడుగుతారు. మొత్తం పేపర్‌ను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మార్కులు: 100; పార్ట్‌-ఎ (మ్యాథమెటిక్స్‌- 40 మార్కులు), (పార్ట్‌-బి: ఫిజిక్స్‌/ పార్ట్‌-సి: కెమిస్ట్రీ 30 మార్కుల చొప్పున).

పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 22, రూ.750/- ఆలస్య రుసుంతో జూన్‌ 26 వరకు.

హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: జూన్‌ 28

పరీక్ష తేదీ: జూన్‌ 30

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: www.audoa.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని