క్రీడా కోర్సుల్లో చేరతారా?

క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించేవారు నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ సంస్థ యూజీ, పీజీ స్థాయుల్లో పలు క్రీడా కోర్సులు అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు...

Published : 22 Jun 2022 01:27 IST

క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించేవారు నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ సంస్థ యూజీ, పీజీ స్థాయుల్లో పలు క్రీడా కోర్సులు అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు...

వివివిధ రంగాలకు నిపుణులను అందించడం కోసం జాతీయ స్థాయిలో పలు విద్యా సంస్థలను నెలకొల్పారు. అదే తరహాలో క్రీడలకు సంబంధించిన శిక్షణలో రాణించడానికి కేంద్ర యువజన, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంఫాల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎస్‌యూ) ఏర్పాటు చేశారు. దీనికి కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా కల్పించారు. పరీక్షలో చూపిన ప్రతిభ, క్రీడా నేపథ్యం, వైవాలతో కోర్సుల్లో చేర్చుకుంటారు. 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.


ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌

(అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌)

వ్యవధి: రెండేళ్లు సీట్లు: 15

అర్హత: డిగ్రీతోపాటు స్పోర్ట్స్‌ కోచింగ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

ప్రవేశం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌, వైవాతో అవకాశం కల్పిస్తారు. పరీక్షకు వంద, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 20, గేమ్‌ ప్రొఫిషియన్సీకి 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30, వైవాకు 20 మార్కులు ఉంటాయి. పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, స్పోర్ట్స్‌ సైన్స్‌ 40, అభ్యర్థి ఎంచుకున్న స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌లో 40 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 2 గంటలు.  

కెరియర్‌: స్పోర్ట్స్‌ కోచ్‌లకు వారి నైపుణ్యాలను అనుసరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో డిమాండ్‌ ఉంది. వీరు పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో సంబంధిత క్రీడా శిక్షకులుగా రాణించవవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లలో మేనేజర్‌గానూ ఎదగవచ్చు. ప్రైవేటు క్రీడా కేంద్రాల్లో స్పోర్ట్స్‌ కోచ్‌గా అవకాశాలు అందుకోవచ్చు.


ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ

వ్యవధి: రెండేళ్లు  సీట్లు: 15

అర్హత: 50 శాతం మార్కులతో బీపీఎడ్‌ లేదా బీఏ సైకాలజీ/ స్పోర్ట్స్‌ సైకాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రీడల్లో ప్రాతినిథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ప్రవేశం: పరీక్ష, వైవా, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్షకు వంద, వైవాకు 20, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30 మార్కులు ఉంటాయి. పరీక్షలో స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, రీజనింగ్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సైకాలజీ/స్పోర్ట్స్‌ సైకాలజీకి 70 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు.

కెరియర్‌: వీరు క్రీడాకారులకు మెంటర్‌గా వ్యవహరించవచ్చు. రిసెర్చర్‌, కౌన్సెలర్‌, థెరపిస్టుగా సేవలు అందించవచ్చు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యం దిశగా అడుగులు పడేలా ప్రోత్సహించేది వీరే.


బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌

వ్యవధి: నాలుగేళ్లు. వీరికి ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, హాకీ, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగుల్లో శిక్షణ అందిస్తారు.

సీట్లు: 50

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు.

కెరియర్‌: వీరు జాతీయ సంస్థలు, ప్రైవేటు క్లబ్‌లు, పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో కోచ్‌, కోచింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందించవచ్చు.


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (బీపీఈఎస్‌)

వ్యవధి: మూడేళ్లు. సీట్లు: 50

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు.  

కెరియర్‌: వీరు పాఠశాలలు, కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ క్లబ్బులు, హెల్త్‌ క్లబ్బుల్లో సేవలు అందించవచ్చు. స్పోర్ట్స్‌ సెంటర్లలో కోచ్‌ గానూ కొనసాగవచ్చు.


మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌(ఎంపీఈఎస్‌)

వ్యవధి: రెండేళ్లు  సీట్లు: 30

అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (బీపీఈఎస్‌) లేదా సమాన స్థాయి కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.  

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, వైవాలతో. పరీక్షకు వంద మార్కులు. ఇందులో స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 60, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ 20 మార్కులకు.ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 20, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ 30, వైవా 20 మార్కులకు ఉంటాయి.  

కెరియర్‌: వీరు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్పోర్ట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఆతిథ్యరంగం, హెల్త్‌క్లబ్బుల్లోనూ అవకాశాలు ఉంటాయి. పర్సనల్‌ ట్రైనర్లు, కోచ్‌లు, ఇన్‌స్ట్రక్టర్లగా సేవలు అందించవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 25. పరీక్ష తేదీ: జులై 19

వెబ్‌సైట్‌: https://www.nsu.ac.in/admission


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని