‘మహీంద్రా’లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరంలో ఉన్న క్యాంపస్‌లో ఎంటెక్‌ కోర్సులో కొత్తగా 4 స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టింది. నేటితరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులను ఇండస్ట్రీకి సిద్ధం చేసేలా ఈ కోర్సులను రూపొందించారు.

Published : 28 Jun 2022 00:47 IST

మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరంలో ఉన్న క్యాంపస్‌లో ఎంటెక్‌ కోర్సులో కొత్తగా 4 స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టింది. నేటితరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులను ఇండస్ట్రీకి సిద్ధం చేసేలా ఈ కోర్సులను రూపొందించారు.

కోల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - మహీంద్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ కోర్సులు... ఇంజినీరింగ్‌లో కొత్త టెక్నాలజీతో కలగలిసి ఉండబోతున్నాయి. అవి... సీఎస్‌ఈ, డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ, సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌.

గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, తత్సమాన అర్హత కలిగిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండటం తప్పనిసరి. గేట్‌ పరీక్షలో 80, ఆపైన పర్సంటైల్‌ ఉన్నవారు ప్రవేశానికి ముఖాముఖి పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతరులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష రాయాలి.

* గేట్‌ పరీక్ష ద్వారా చేరాలనుకునే విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.లక్ష ఉంటుంది. వారికి రూ.15 వేలు స్టైపెండ్‌తో కూడిన టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది. క్యాంపస్‌లో ఉండటం, భోజన వసతి ఉచితంగా లభిస్తాయి. ఇతరులు ఫీజు రూ.లక్షకు అదనంగా రూ.2 లక్షల హాస్టల్‌ రుసుం కట్టాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని