పిలుస్తోంది... నలంద!

విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్‌లోని రాజ్‌గిరీలో ఏర్పాటైన ఈ సంస్థ పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో పలు కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరడానికి భారత్‌తోపాటు 18....

Published : 29 Jun 2022 00:34 IST

విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్‌లోని రాజ్‌గిరీలో ఏర్పాటైన ఈ సంస్థ పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో పలు కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరడానికి భారత్‌తోపాటు 18 భాగస్వామ్య దేశాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉంది. ఇక్కడ చదువుతోన్నవారిలో 60 శాతం మంది విదేశీయులే. కోర్సులన్నీ ప్రపంచ దృక్పథంతో, ఆసియా ఖండాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ కోర్సులు

ఎంఏ: హిందూ స్టడీస్‌, వరల్డ్‌ లిటరేచర్‌, హిస్టారికల్‌ స్టడీస్‌, బుద్ధిస్ట్‌ స్టడీస్‌ ఫిలాసఫీ అండ్‌ కంపారటివ్‌ రెలిజియన్‌

ఎంబీఏ: సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

ఎమ్మెస్సీ: ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

పీహెచ్‌డీ: వరల్డ్‌ లిటరేచర్‌, సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌, హిస్టారికల్‌ స్టడీస్‌, బుద్ధిస్ట్‌ స్టడీస్‌ ఫిలాసఫీ అండ్‌ కంపారటివ్‌ రెలిజియన్‌, హిందూ స్టడీస్‌.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా యూజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా రెండు కోర్సులకే పోటీపడవచ్చు. ఎంబీఏకు క్యాట్‌/ఎక్స్‌ఏటీ/మ్యాట్‌ ఎందులోనైనా 70 పర్సంటైల్‌ తప్పనిసరి. పీహెచ్‌డీకీ సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక: మీ గురించి తెలపడానికి స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ) 250 పదాలకు మించకుండా రాయాలి. ఇందులో నలందలో ఎందుకు చదవాలనుకుంటున్నారో తెలిపేలా వంద పదాలకు మించకుండా వివరించాలి. అలాగే సంబంధిత కోర్సును ఎంచుకోవడానికి కారణాలను 300 నుంచి 500 పదాల్లో వివరించాలి. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారైతే టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ తప్పనిసరి. ఇవన్నీ దరఖాస్తుతో పంపాలి. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.

తరగతులు: ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రెసిడెన్షియల్‌ విధానంలో వీటిని అందిస్తున్నారు. పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. పీహెచ్‌డీలకు నాలుగేళ్లు. పీహెచ్‌డీకి ఎంపికైనవారికి నెలకు రూ.35,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.  
నలంద సంస్థ స్వల్పకాల వ్యవధితో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులనూ అందిస్తోంది.

డిప్లొమా: సంస్కృతం, ఇంగ్లిష్‌, కొరియన్‌, యోగా

సర్టిఫికెట్‌: సంస్కృతం, ఇంగ్లిష్‌, కొరియన్‌, పాళీ, యోగా.
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలోకి తీసుకుంటారు. ప్రకటన త్వరలో వెలువడనుంది.  

వెబ్‌సైట్‌: https://nalandauniv.edu.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని