పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా?
ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. పాసైనవాళ్లంతా మెడిసిన్, ఇంజినీరింగ్, లా, ఒకేషనల్ కోర్సులు... ఇలా వేటిలో చేరాలా అని ఆలోచిస్తుంటారు. విజేతలను ప్రపంచం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. వాళ్లకు అందరి ప్రశంసలూ అందుతాయి. కానీ ఫెయిల్ అయినవాళ్ల సంగతి ఏమిటి? వారి గురించి ఒక్కసారి ఆలోచిద్దామా....
* అపజయానికి ఎన్నో కారణాలుంటాయి. పరీక్షల సమయానికి విద్యార్థి ఆరోగ్యం సరిగాలేకపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల అనారోగ్యం, ఆకస్మిక మరణం వారిని లక్ష్యం నుంచి వెనక్కు నెట్టొచ్చు.
* ఫెయిలైన తర్వాత కుటుంబసభ్యులు కోప్పడతారనో.. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేస్తారనో.. చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేమనే భయంతో ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.
* నిజానికి గెలుపోటములు తాత్కాలికమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి రాత్రి అలాగే శాశ్వతంగా ఉండిపోదు. దాని వెంట వెలుగూ వస్తుంది. వైఫల్యానికి కారణాలను తెలుసుకుని మధ్యంతర పరీక్షలకు సిద్ధంకావాలి.
మంచి మార్కులు తెచ్చుకున్న నేస్తాలను కలిసి పరీక్ష రాయడంలోని కొన్ని మెలకువలనూ నేర్చుకోవచ్చు. వారి సహాయంతో ఈసారి బాగా రాసి విజయం సాధించవచ్చు.
* అన్నిటికంటే ముఖ్యమైంది మన ప్రాణం. మనమంటూ జీవించి ఉంటే... ఈరోజుకాక పోతే రేపు విజయం మన బానిస అవుతుంది. క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో అమూల్యమైన జీవితాన్ని కోల్పోతాం.
* ‘తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలనీ... తరిమేవాళ్లను హితులుగ తలచి ముందుకెళ్లాలని...’ కన్నీళ్లను తుడిచే ఇలాంటి స్ఫూర్తిదాయక గీతాలను వినొచ్చు. బాధను మరిపించి మనసుకు సాంత్వన అందించే పాటలు మనకెన్నో ఉన్నాయి. మనసుకు దగ్గరైన స్నేహితులతో బాధను పంచుకుంటే బాధ సగం తగ్గినట్టే.
* ఇదే చివరి అపజయం అనుకుని సానుకూల దృక్పథంతో ప్రయత్నించడం మొదలుపెట్టాలి. ఆత్మవిశ్వాసం ముందు వైఫల్యం తలవంచుతుంది. ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగుతుంది.
* చివరిగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతోమంది కుబేరులు, వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు ఉన్నత చదువులు చదివినవారు కాదు. అయినా... వాళ్లంతా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని అందులో అద్భుతాలు సృష్టించారు. ప్రయత్నిస్తే మీరూ అలా కాగలరు!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PV Sindhu: భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో మెరిసిన పీవీ సింధు
-
General News
CM KCR: దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి: కేసీఆర్
-
India News
Sanjay Raut: సంజయ్ రౌత్‌కు దక్కని ఊరట.. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి..!
-
Movies News
Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
-
Sports News
CWG 2022: తండ్రి చేసిన త్యాగమే.. నీతూ కలకు ప్రాణం..!
-
Politics News
BJP Vs JDU: భాజపాతో బంధానికి బీటలు.. సోనియాకు నీతీశ్ కాల్ చేశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస