హెల్త్‌కేర్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు

విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ. బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారంతో అందించే పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్‌ తరగతులను బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, విశాఖపట్నంలోని కిమ్స్‌- ఐకాన్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌లోే నిర్వహిస్తారు.

Published : 21 Jul 2022 00:34 IST

విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ. బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారంతో అందించే పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్‌ తరగతులను బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, విశాఖపట్నంలోని కిమ్స్‌- ఐకాన్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌లోే నిర్వహిస్తారు.

రెండు సంవత్సరాల పీజీ కోర్సు... మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 40 సీట్లున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఫీజు ఏడాదికి రూ.45,000.
ఈ కోర్సునూ, మరో మూడు పీజీ డిప్లొమాలనూ (క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ) సెల్ఫ్‌ సపోర్డెడ్‌ కోర్సులుగా అందిస్తున్నారు. డిప్లొమాల కాల వ్యవధి ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఎస్సీ/ బీ.ఫార్మసీ/ బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఒక్కో డిప్లొమాకు 15 చొప్పున సీట్లు కేటాయించారు. కోర్సు ఫీజు ఏడాదికి రూ.50,000 చొప్పున ఉంటుంది.
వయసు: అభ్యర్థి వయసు 20- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: దరఖాస్తు ఫారాన్ని సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, వివరాలను నింపి, నిర్దేశించిన అకడమిక్‌ పత్రాలను జతచేసి కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెద వాల్తేరు, విశాఖపట్నం- 530003..
దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500. అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ఫీజు: రూ.200..
ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, రిజర్వేషన్‌ నిబంధనలను ఆధారంగా కౌన్సెలింగ్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: జులై 31, రూ.500 ఆలస్య రుసుంతో ఆగస్టు 6 వరకు.
అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తేదీ: ఆగస్టు 8.

వెబ్‌సైట్‌:www.audoa.in


శ్రీకాకుళం అంబేడ్కర్‌ వర్సిటీలో...

శ్రీకాకుళంలోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఒక్కో ప్రోగ్రామ్‌కు 40 చొప్పున సీట్లు కేటాయించారు. థియరీ, ప్రాక్టికల్‌ తరగతులను బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం(రాగోలు)లో ఉన్న జెమ్స్‌ ఆసుపత్రిలో నిర్వహిస్తారు.
పీజీ డిప్లొమా పూర్తయ్యేలోపు రోగికి సంబంధించిన మెడికల్‌ రికార్డు, వ్యాధి సమాచారాన్ని మెడికల్‌ కోడ్‌ రూపంలో భద్రపర్చడంపై విద్యార్థులు పట్టు సాధిస్తారు. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నీషియన్లుగా విధులు నిర్వర్తిస్తారు. మంచి విశ్లేషణ సామర్థ్యం, సమయపాలన, భాషా నైపుణ్యాలున్నవారు ఈ ఉద్యోగంలో బాగా రాణిస్తారు.
కనీస అర్హత: ఏదైనా డిగ్రీ(ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఎస్సీ/ బీఫార్మసీ/ బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఏ/ బీకాం)లో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
వయసు: ఆగస్టు 31, 2022 నాటికి, 20- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 250.
దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: జులై 30.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, వివరాలను నమోదు చేసి, ఈ కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: ప్రిన్సిపల్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, కామర్స్‌, లా అండ్‌ ఎడ్యుకేషన్‌, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం- 532410.

వెబ్‌సైట్‌: www.brau.edu.in/, www.bollinenimedskills.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని