కోరిన కోర్సులోకి.. ఇగ్నో దారి!

నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రత్యక్ష విధానంలో ఏదైనా కోర్సు పూర్తి చేద్దామన్నా అది సమీపంలోని విద్యా సంస్థల్లో లేకపోవచ్చు. ఇలాంటివారు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ సంస్థ సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ స్థాయుల్లో విభిన్న రకాల కోర్సులు అందిస్తోంది. జులై సెషన్‌లో ప్రవేశాలకు ఇప్పుడు ప్రకటన వెలువరించింది!

Published : 28 Jul 2022 00:52 IST

నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రత్యక్ష విధానంలో ఏదైనా కోర్సు పూర్తి చేద్దామన్నా అది సమీపంలోని విద్యా సంస్థల్లో లేకపోవచ్చు. ఇలాంటివారు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ సంస్థ సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ స్థాయుల్లో విభిన్న రకాల కోర్సులు అందిస్తోంది. జులై సెషన్‌లో ప్రవేశాలకు ఇప్పుడు ప్రకటన వెలువరించింది!

కోర్సుల్లో వైవిధ్యం, స్టడీ సెంటర్లు అందుబాటులో ఉండటం, ఆన్‌లైన్‌లో నేర్చుకునే సౌలభ్యం, కాంటాక్ట్‌ తరగతులు, సర్టిఫికెట్‌కు ఆదరణ... తదితర కారణాలతో ఎక్కువమంది ఇగ్నో అందించే కోర్సుల్లో చేరుతున్నారు. తక్కువ విద్యార్హతలు ఉన్నవారు, వృత్తి నిపుణులు, ఉన్నత విద్యను కోరుకునేవారు, స్వయం ఉపాధి ఆశించేవారు...ఇలా అందరి అవసరాలూ తీరేలా భిన్న కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది.

ఏడాదికి రెండు సార్లు- జనవరి, జులైల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌, సోషల్‌ సైన్సెస్‌, మెడిసిన్‌, న్యూట్రిషన్‌, నర్సింగ్‌, అగ్రికల్చర్‌, లా... ఇలా రంగాలు, వృత్తులవారీ విస్తృత కోర్సులు ఈ సంస్థ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారి కోసం పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌.. మొదలైనవి తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, టూర్‌ ప్లానర్స్‌, అకౌంటెంట్స్‌...ఇలా అన్ని వృత్తులూ, రంగాలకు ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయుల్లో అందుబాటులో ఉన్నాయి.  

ఇవీ అర్హతలు

పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఏదైనా యూజీ పూర్తిచేసుకున్నవారికి అవకాశం ఉంది. కొన్నింటికి మాత్రం సంబంధిత/ అనుబంధ విభాగాలను యూజీలో చదవాలి. యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లోకి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో అవకాశం కల్పిస్తారు.

కోర్సులిలా...

ఎంకాం: జనరల్‌, ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌, బిజినెస్‌ పాలసీ అండ్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌
ఎంబీఏ: జనరల్‌, హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌
ఎంఏ: ఇంగ్లిష్‌, హిందీ, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌, ఆంత్రొపాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, ఫిలాసఫీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, అర్బన్‌ స్టడీస్‌, విమెన్‌ అండ్‌ జెండర్‌ స్టడీస్‌, జెండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌, జ్యోతిషం, వేదిక్‌ స్టడీస్‌, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, సస్టెయినబిలిటీ సైన్స్‌, డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మొదలైనవి  
ఎమ్మెస్సీ: ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరపీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌..తదితరాలతోపాటు ఎంసీఏ.
యూజీ డిగ్రీ: బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీఏ టూరిజం స్టడీస్‌, బీఎస్‌డబ్ల్యూ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌), బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌)

కోర్సులు

ఆనర్స్‌ విధానంలో బీఏ: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, ఉర్దూ, కోర్సులను ఎంచుకోవచ్చు. బీఎస్సీ బయో కెమిస్ట్రీ, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ (హిందూస్థానీ మ్యూజిక్‌)


పీజీ డిప్లొమా

రూరల్‌ డెవలప్‌మెంట్‌, కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరపీ, ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, మెంటల్‌ హెల్త్‌, లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌
డెవలప్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఆడియో ప్రోగ్రాం ప్రొటెక్షన్‌, డిజిటల్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, అగ్రి బిజినెస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, క్రిమినల్‌ జస్టిస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, ఫోక్‌లర్‌ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, బుక్‌ పబ్లిషింగ్‌, బ్రిటిష్‌ లిటరేచర్‌, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్‌, హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, వాస్తు శాస్త్ర, యానిమల్‌ వెల్ఫేర్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.

డిప్లొమా

ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, పంచాయత్‌ లెవెల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం స్టడీస్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, ఉర్దూ లాంగ్వేజ్‌, డైరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌, హార్టికల్చర్‌, బీపీఓ, మోడర్న్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌, పారా లీగల్‌ ప్రాక్టీస్‌, ఆక్వాకల్చర్‌, రిటైలింగ్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌... ఉన్నాయి.  

పీజీ సర్టిఫికెట్‌

సైబర్‌ లా, పేటెంట్‌ ప్రాక్టీస్‌, క్లైమేట్‌ ఛేంజ్‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ పాలసీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, బెంగాల్‌ - హిందీ ట్రాన్స్‌లేషన్‌, మలయాళం - హిందీ ట్రాన్స్‌లేషన్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ..

సర్టిఫికెట్‌

లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, గైడెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, సెరీ కల్చర్‌, ట్రైబల్‌ స్టడీస్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, బీ కీపింగ్‌, పలు విదేశీ భాషలు, ఫస్ట్‌ ఎయిడ్‌, యోగ, హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్‌, థియేటర్‌ ఆర్ట్స్‌..


ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌...

కార్పొరేట్‌ పార్టీలు, బ్రాండ్‌ ప్రమోషన్‌, ప్రొడక్ట్‌ లాంచింగ్‌, ఆడియో ఫంక్షన్‌, వివాహం, పుట్టినరోజు వేడుకలు...ఇలా కార్యక్రమం ఏదైనా ప్రణాళిక ప్రకారం నిర్వహణ నైపుణ్యాలను ఈవెంట్‌ మేనేజర్లు ప్రదర్శిస్తారు. ఈ రంగంలో శిక్షణ పొందడానికి ఇగ్నో అందించే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా కోర్సులో చేరిపోవచ్చు. అనంతరం ఏదైనా ఈవెంట్‌ సంస్థలో ఉద్యోగం పొందడం లేదా సొంతగా ఈవెంట్స్‌ నిర్వహించడం చేసుకోవచ్చు. ఇంటర్‌ ఉత్తీర్ణులు ఇందులో చేరడానికి అర్హులు. ఆంగ్ల మాధ్యమంలో కోర్సు ఉంటుంది. ఈవెంట్‌ ప్లానింగ్‌, కోఆర్డినేషన్‌, మార్కెటింగ్‌...మొదలైనవి నేర్పుతారు. ఇంటర్న్‌షిప్‌ సైతం చేయిస్తారు. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.8000.

బీపీవో

బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌లో డిప్లొమా కోర్సు ఇగ్నో అందిస్తోంది. విద్యార్థులు బీపీవో పరిశ్రమలో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఇది పూర్తిచేసుకున్నవారికి ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, బీపీవో రెండు విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తాయి. 50 శాతం మార్కులతో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారూ అర్హులే. కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.10,000.

ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వినియోగం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో వ్యవసాయదారుల్లో సేంద్రియ (ఆర్గానిక్‌) సాగుపై అవగాహన కల్పించడం, ఆ విధానంలో పండించిన ఉత్పత్తులకు గుర్తింపు (సర్టిఫికేషన్‌) తెచ్చుకోవడంపై అవగాహన కల్పించేలా కోర్సు రూపొందించారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఇంటర్‌ ఉత్తీర్ణులు చేరవచ్చు. ఫీజు రూ.4800.

పౌల్ట్రీ, డెయిరీ కోర్సులు

ఔత్సాహికుల కోసం ఇగ్నో తెలుగు మాధ్యమంలో పౌల్ట్రీ ఫార్మింగ్‌ కోర్సు అందిస్తోంది. ఏడాది పొడవునా ఆదాయం అందించడం పౌల్ట్రీ ప్రత్యేకత. ఈ రంగంలో సిరులు కురవాలంటే కోళ్ల పెంపకం, వాటి పోషణ, ఫారాల నిర్వహణపై శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. ఆ దిశగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3600. ఎనిమిదో తరగతి విద్యార్హతతో ఇందులో చేరవచ్చు.

ఇదే విద్యార్హతతో తేనె తయారీ కోసం బీ కీపింగ్‌ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. 6 నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.1400.

డెయిరీ ఫార్మింగ్‌ అవేర్‌నెస్‌ కోర్సును తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. జంతువుల పెంపకం, రోగాల బారినుంచి వాటిని సంరక్షించడం, పాల దిగుబడి పెంచడం, దాణా ఎంచుకోవడం..తదితరాలు ఇందులో నేర్పుతారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. కోర్సు వ్యవధి 2 నెలలు. ఫీజు రూ.1100.

డెయిరీ టెక్నాలజీ కోర్సు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. వ్యవధి ఏడాది. కోర్సు ఫీజు రూ.15,200.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని