డిజైన్‌తో మెప్పించగలరా!
నగలు అందాన్నే కాదు... ధరించిన వారి ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. గతంలో వీటి రూపకల్పనను ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు అప్పటికే నగల వ్యాపారంలో ఉన్న కుటుంబాల వారే ఆసక్తి చూపేవారు... కానీ ఇప్పుడలా కాదు. సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం ఉండి, ఫ్యాషన్‌పై పట్టున్న వారు జ్యువెలరీ డిజైనింగ్‌లో రాణిస్తున్నారు.
జ్యువెలరీ డిజైనింగ్
నగలు అందాన్నే కాదు... ధరించిన వారి ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. గతంలో వీటి రూపకల్పనను ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు అప్పటికే నగల వ్యాపారంలో ఉన్న కుటుంబాల వారే ఆసక్తి చూపేవారు... కానీ ఇప్పుడలా కాదు. సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం ఉండి, ఫ్యాషన్‌పై పట్టున్న వారు జ్యువెలరీ డిజైనింగ్‌లో రాణిస్తున్నారు. మరి ఇందులో అడుగుపెట్టాలంటే ఎలాగో మీరూ చూసేయండి.
ఆభరణాలు భారతీయ సంస్కృతిలో భాగం. సందర్భాన్ని ప్రతిబింబించేలా, అందరి దృష్టినీ ఆకర్షించేలా ధరించే నగల రూపకల్పనకు ఎంతో నైపుణ్యం కావాలి. సృజనాత్మకంగా ఆలోచించేవారు, కొత్త కొత్త డిజైన్ల తయారీపై ఆసక్తి ఉన్నవారు, ప్రతి చిన్న వస్తువు రూపునూ లోతుగా గమనించే దృష్టి ఉన్నవారికి జ్యువెలరీ డిజైనింగ్ చక్కని ఎంపిక.
* డిజైనర్‌లకు డిజైన్ తయారీతోపాటు ఐటెమ్ కటింగ్, పాలిషింగ్, షేపింగ్, స్టోన్ సెట్టింగ్, వెల్డింగ్ వంటి పనులపైనా కనీస అవగాహన ఉండాలి. తొలుత జ్యువెలర్స్ దగ్గర పనిచేసి అనంతరం ఫ్రీలాన్సర్‌గానూ చేయవచ్చు. కొంత అనుభవం తర్వాత సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకుని కలెక్షన్‌ను కూడా విడుదల చేయవచ్చు.
అర్హతలేంటి?
ఈ రంగంలో రాణించేందుకు కొత్తగా ఆలోచించడం, అందంగా - సృజనాత్మకంగా మోడల్స్‌ను గీయడం, వాటిని ఆకట్టుకునేలా రూపొందించగలగడం అనేదే ప్రధానమైన అర్హత. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన చదువు పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా జ్యువెలరీ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారికి ప్రాథమిక స్థాయి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అదే పీజీ ఉంటే మరీ మంచిది. అయితే చక్కని పనితనం ఉంటే డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సులు చేసినా మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, టెక్నికల్ నైపుణ్యాలు తప్పనిసరి.
బాధ్యతలేంటి?
జ్యువెలరీ డిజైనర్లకు క్యాడ్ ద్వారా లేదా చేతితో చక్కటి వినూత్న డిజైన్లు రూపొందించడం, అందులో లోపాలను గుర్తించి సవరించడం, సంస్థను బట్టి, బ్రాండ్‌ను బట్టి తగిన డిజైన్లు ఆలోచించడం, ఆర్డర్లు - ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం వంటి బాధ్యతలుంటాయి.
ప్రవేశ పరీక్షలు
దేశంలో ఉన్న మేటి డిజైనింగ్ కోర్సుల్లో చేరేందుకు నిఫ్ట్, ఎన్‌ఐడీ డీఏటీ, ఏఐఈఈడీ, పెరల్ అకాడమీ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో మంచి స్కోరు సాధించడం ద్వారా నచ్చిన కోర్సులో చేరొచ్చు. కొన్ని కళాశాలలు నేరుగా మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
కోర్సుల వివరాలు
బీడీఎస్ ఇన్ జ్యువెలరీ డిజైన్, డిప్లొమా, బీఏ ఇన్ జ్యువెలరీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, బీఎస్సీ ఇన్ జ్యువెలరీ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ ఇన్ జ్యువెలరీ డిజైన్, ఎండీఎస్ ఇన్ జ్యువలరీ డిజైన్ వంటి పలు పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ పలు స్వల్పకాల వ్యవధి గల కోర్సులు లభిస్తున్నాయి. వీటికి కోర్సు కాల వ్యవధి, కళాశాలను బట్టి సగటున రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకూ ఫీజు ఉంటుంది.
టాప్ కాలేజీలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ, జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎలెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ - జైపూర్, ఆర్క్ కాలేజ్ ఆఫ్ డిజైన్ అండ్ బిజినెస్ - జైపూర్, వోగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ - బెంగళూరు, పరుల్ యూనివర్సిటీ - గుజరాత్, బియాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ - జైపూర్, జైన్ యూనివర్సిటీ - బెంగళూరు, ఎన్‌ఎస్‌ఏఎం అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ - ముంబయి తదితర కళాశాలలు మనదేశంలో జ్యువెలరీ డిజైనింగ్ కోర్సులకు చెప్పుకోదగ్గవి.
ఎలాంటి ఉద్యోగాలు...
ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు క్యాడ్ డిజైనర్, మాన్యువల్ డిజైనర్, రీటచర్, సెట్టర్, జెమాలజిస్ట్, బెంచ్ జ్యువెలర్, డైమండ్ గ్రేడర్, జెమ్ పాలిషర్ వంటి కొలువుల్లో చేరవచ్చు. ఏ విభాగంలో ఆసక్తి ఉందనే విషయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి యాక్సెసరీ డిజైనింగ్ హౌసెస్, జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్, పేరుమోసిన జ్యువెలరీ సంస్థల్లోనే కాకుండా సినిమా, టీవీ పరిశ్రమలోనూ అవకాశాలు ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!