సగం ప్రశ్నలతో 99 పర్సంటైల్‌

‘క్యాట్‌’లో గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. అయినప్పటికీ 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 99 పర్సంటైల్‌ సాధించవచ్చు!

Published : 29 Nov 2022 00:51 IST

క్యాట్‌-2022 విశ్లేషణ

‘క్యాట్‌’లో గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. అయినప్పటికీ 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 99 పర్సంటైల్‌ సాధించవచ్చు!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లతోపాటు దేశంలో పేరొన్న బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రవేశానికి కామన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (క్యాట్‌) స్కోరు ప్రామాణికం. ఈ పరీక్షను నవంబరు 27 (ఆదివారం) ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం 3 సెషన్లలో నిర్వహించారు.

తొలి రెండు సెషన్లతో పోలిస్తే సాయంత్రం కొంచెం తేలికగా ఉందని పరీక్ష రాసిన విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే సెషన్లవారీ సంబంధిత సెక్షన్లలో ప్రశ్నల కఠినత్వ స్థాయిలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మొత్తం మీద అన్ని సెషన్లూ దాదాపు ఒకేలా ఉన్నాయని క్యాట్‌ శిక్షకులు అంటున్నారు. నార్మలైజేషన్‌ పాటించడంతో ఎవరికీ ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు.

క్యాట్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (క్యూఏ), వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏ అండ్‌ ఆర్‌సీ), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ (డీఐ అండ్‌ ఎల్‌ఆర్‌). పరీక్షలో ఈ మూడు సెక్షన్లకూ సమాన ప్రాధాన్యం ఉంది. పేరున్న బీ స్కూళ్లన్నీ ఈ సెక్షన్లవారీ కటాఫ్‌ నిర్ణయించి, ప్రవేశాలు కల్పిస్తాయి. నవంబరు 27 (ఆదివారం) పరీక్షను గమనిస్తే...

వీటిలో ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కోత. నాన్‌ ఎంసీక్యూలకు రుణాత్మక మార్కులు లేవు.

పరీక్ష కఠినంగా ఉందా?

క్యాట్‌-2022 పరీక్ష నవంబరు 27 (ఆదివారం) ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం 3 సెషన్లలో నిర్వహించారు. దాదాపు 3 సెషన్లలోనూ ప్రశ్నల స్థాయిలో పెద్దగా వ్యత్యాసం లేదనే చెప్పుకోవచ్చు. సెక్షన్లవారీ చూసుకుంటే కొద్దిగా మార్పులు ఉన్నాయి. మిగతా రెండింటి కంటే సాయంత్రం స్లాట్‌ కొంచెం సులువుగా ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇందులో క్యూఏ విభాగం కొంచెం కఠినంగానే ఉన్నప్పటికీ వీఏఆర్‌సీ, డీఐఎల్‌ఆర్‌ విభాగాల ప్రశ్నలు కొంచెం తేలికగా ఉండటంతో ఈవెనింగ్‌ స్లాట్‌ మిగతా వాటి కంటే బాగున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఏమైనప్పటికీ మిగతా స్లాట్‌ల్లో పరీక్ష రాసినవారు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్లాట్ల మధ్య స్వల్ప తేడాలున్నప్పటికీ నార్మలైజేషన్‌ ద్వారా లెక్కింపు జరుగుతుంది. దీంతో అందరికీ సమ న్యాయం దక్కుతుంది.

99 పర్సంటైల్‌

క్యాట్‌ మొత్తం 198 (66 X 3) మార్కులకు నిర్వహించారు. గమనించాల్సిన విషయం 99 పర్సంటైల్‌ సాధించడానికి మొత్తం ప్రశ్నపత్రంలో 50 శాతం ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించినా సరిపోతుంది. సన్నద్ధతకు వీలైనంత సమయం కేటాయించి, సరైన ప్రణాళికతో పరీక్ష రాసినవారంతా క్యాట్‌లో మంచి స్కోరు సాధించడం సాధ్యమే.


దాదాపు 3 సెషన్లలోనూ ప్రశ్నల స్థాయిలో పెద్దగా వ్యత్యాసం లేదనే చెప్పుకోవచ్చు.  సెక్షన్లవారీ చూసుకుంటే కొద్దిగా మార్పులు ఉన్నాయి. మిగతా రెండింటి కంటే సాయంత్రం స్లాట్‌ కొంచెం సులువుగా ఉంది.


హైస్కూల్‌ స్థాయి పరీక్షే!

క్యాట్‌లో ప్రశ్నలు చాలా వరకు హైస్కూల్‌ స్థాయిలోనివే. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ ప్రశ్నలు హైస్కూల్‌ మ్యాథ్స్‌ పాఠ్యాంశాల పరిధిని మించవు. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ సెక్షన్‌కు.. కామన్‌సెన్స్‌, ప్రాథమిక తర్క పరిజ్ఞానం అనువర్తనం తెలిస్తే సమాధానాలు సులువే. మరో విభాగం వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో వ్యాకరణంలోని క్లిష్ట అంశాలు,  పదసంపదపై లోతైన ప్రశ్నలు అడగరు. దీనిద్వారా గమనించాల్సింది ఏమంటే.. అభ్యర్థి విద్యా నేపథ్యం(సాధారణ డిగ్రీ, బీటెక్‌) ఏదైనప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే క్యాట్‌లో మంచి పర్సంటైల్‌ పొందడం కష్టమేమీ కాదు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు