సీఆర్‌పీఎఫ్‌లో చేరతారా?

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) 1458 ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన స్త్రీ, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 04 Jan 2023 05:06 IST

1458 ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు  

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) 1458 ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన స్త్రీ, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల్లో.. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) పోస్టులు 143 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 58, ఈడబ్ల్యూఎస్‌కు 14, ఓబీసీకి 39, ఎస్సీకి 21, ఎస్టీకి 11 కేటాయించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) ఖాళీలు 1315 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 532, ఈడబ్ల్యూఎస్‌కు 132, ఓబీసీకి 355, ఎస్సీకి 197, ఎస్టీకి 99 పోస్టులను కేటాయించారు.

శారీరక ప్రమాణాలు: పురుషులు 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 82 సెం.మీ. ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు 162.5 సెం.మీ. ఎత్తు ఉండి, ఛాతీ 76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 81 సెం.మీ. ఉండాలి. మహిళలు 155 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ మహిళలకు 150 సెం.మీ. సరిపోతుంది..

వయసు: 25.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేసన్‌, డిటైల్డ్‌ మెడికల్‌ టెస్ట్‌, రివ్యూ మెడికల్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు.

సీబీటీ: ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఏబీసీడీ అనే నాలుగు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో హిందీ లేదా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (ఆప్షనల్‌), సెక్షన్‌-బిలో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, సెక్షన్‌-సిలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, సెక్షన్‌-డిలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో సెక్షన్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున కేటాయించారు. సెక్షన్‌ బీసీడీ ప్రశ్నలు ఇంగ్లిష్‌/ హిందీల్లో ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉంటాయి.

సీబీటీలో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థుల తుది ఎంపిక సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది.

స్కిల్‌ టెస్ట్‌: సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఏఎస్సై (స్టెనో)కు పది నిమిషాల డిక్టేషన్‌ ఉంటుంది. నిమిషానికి 80 పదాల వేగంతో డిక్టేషన్‌ తీసుకోగలగాలి. కంప్యూటర్‌ పైన ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు, హిందీలో 65 నిమిషాల చొప్పున ట్రాన్‌స్క్రిప్షన్‌ చేయగలగాలి.

హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుకు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాల వేగంతో కంప్యూటర్‌పైన టైప్‌ చేయాలి. లేదా హిందీలో నిమిషానికి 30 పదాల వేగంతో టైప్‌ చేయగలగాలి.

పింగ్‌ టెస్ట్‌ను కంప్యూటర్‌పైన మాత్రమే నిర్వహిస్తారు. అవసరమైన కంప్యూటర్లు, కీబోర్డులను రిక్రూట్‌మెంట్‌ సెంటర్లలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. స్కిల్‌ టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. దీనికి మార్కులు ఉండవు. అయితే ఏఎస్సై పోస్టుకు జరిగే షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో 40 తప్పులు వస్తే ఫెయిల్‌ అయినట్టుగా పరిగణిస్తారు.

సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా మెడికల్‌ టెస్ట్‌ కోసం అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో శిక్షణ, కొన్ని పరీక్షలు పాసవ్వాలి. ఆ తర్వాత పోస్టులో శాశ్వతంగా నియమిస్తారు.

వేతన శ్రేణి: అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనో)కు పే లెవెల్‌-05 కింద మూలవేతనం రూ.29,200 ఉంటుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)కు పే లెవెల్‌-04 కింద మూల వేతనం రూ.25,500 చెల్లిస్తారు.

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, పొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలో: ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్‌, వరంగల్‌ (అర్బన్‌).

దరఖాస్తులకు చివరి తేదీ: 25.01.2023

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 22-28 ఫిబ్రవరి 2023

వెబ్‌సైట్‌: www.crpfindia.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని