Published : 24 Jan 2023 00:45 IST

గెయిల్‌లో 277 కొలువులు

ప్రభుత్వ రంగంలోని మహారత్న, సహజ వాయు సంస్థ అయిన గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ 277 పోస్టులను భర్తీ చేయబోతోంది. సీనియర్‌ ఆఫీసర్‌/ ఆఫీసర్‌ (సెక్యూరిటీ) పోస్టులకు అభ్యర్థులను పీఈటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.  పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది.

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, సెక్యూరిటీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్సెషలైజేషన్‌లో 65 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ డిప్లొమా పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60 శాతం సాధించాలి.  

1. చీఫ్‌ మేనేజర్‌ (రెన్యూవబుల్‌ ఎనర్జీ): ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ కెమికల్‌ డిగ్రీ, కేంద్ర/రాష్ట్ర/ ప్రైవేటు సంస్థల్లో 12 ఏళ్ల అనుభవం ఉండాలి. విండ్‌/ సోలార్‌/ హైడ్రోజన్‌ విభాగాల్లో పనిచేయాలి.

2. సీనియర్‌ ఇంజినీర్‌: ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి.

3. సీనియర్‌ ఇంజినీర్‌ (కెమికల్‌): కెమికల్‌/పెట్రోకెమికల్‌/కెమికల్‌ టెక్నాలజీ/పెట్రో కెమికల్‌ టెక్నాలజీ/కెమికల్‌ టెక్నాలజీ అండ్‌ పాలిమర్‌ సైన్స్‌/ కెమికల్‌ టెక్నాలజీ అండ్‌ పబ్లిక్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పెట్రోకెమికల్‌ ప్లాంట్‌/ హైడ్రోకార్బన్‌ రిఫైనరీ/ ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి.

4. సీనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌): మెకానికల్‌/ప్రొడక్షన్‌/ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌/మాన్యుఫ్యాక్చరింగ్‌/కెమికల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ప్లాంట్‌/ హైడ్రోకార్బన్‌ రిఫైనరీ/ ఫెర్టిటైజర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి.

5. సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఆయిల్‌, గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణం, నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి.

6. సీనియర్‌ ఇంజినీర్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ.

7. సీనియర్‌ ఇంజినీర్‌ (గెయిల్‌టెల్‌ టీసీ/టీఎం): ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/అండర్‌టేకింగ్స్‌/ భారీ ప్రైవేటు సంస్థలకు చెందిన ఫైర్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌గా ఏడాది అనుభవం ఉండాలి.

8. సీనియర్‌ ఇంజినీర్‌ (మెటలర్జీ): మెటలర్జీ/మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ,  మెటలర్జీ/మెటలర్జీ అండ్‌ మినరల్స్‌ టెస్టింగ్‌/డ్యామేజ్‌ మెకానిజాన్ని గుర్తించడంలో ఏడాది అనుభవం ఉండాలి.

9. సీనియర్‌ ఆఫీసర్‌ (ఫైర్‌ అండ్‌ సేఫ్టీ): ఫైర్‌/ఫైర్‌ అండ్‌ సేఫ్టీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.

10. సీనియర్‌ ఆఫీసర్‌ (సీఅండ్‌పీ): కెమికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌/మెటలర్జీ/సివిల్‌/టెలి కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ,  కాంట్రాక్ట్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌/మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌/స్టోర్స్‌ అండ్‌ పర్చేస్‌ విభాగంలో ఏడాది అనుభవం.

11. సీనియర్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌): ఇంజినీరింగ్‌ డిగ్రీ, మార్కెటింగ్‌/ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌/ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ/ ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ డిగ్రీ. సంబంధిత విభాగంలో ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి.

12. సీనియర్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌అండ్‌ఏ): సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) లేదా 60 శాతం మార్కులతో బీకాం పాసవ్వాలి. లేదా ఎంబీఏ ఫైనాన్స్‌ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది అనుభవం.  

13. సీనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌): డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ.

14. ఆఫీసర్‌ (సెక్యూరిటీ): డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.సెక్యూరిటీ ఇన్‌స్టలేషన్స్‌, ఫైర్‌ఫైటింగ్‌/ఫస్ట్‌ ఎయిడ్‌లో మూడేళ్ల అనుభవం.
వయసు: 2.02.2023 నాటికి 28-45 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.


ముఖ్యాంశాలు

ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ కోర్సులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సీఏ/సీఎంఏ కోర్సుకు మాత్రం మినహాయింపు.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.  
దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2023
వెబ్‌సైట్‌: https://gailonline.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు