మీలెర్నింగ్ స్టైల్ ఏంటి?
నేర్చుకోవడంలో ఒక్కో విద్యార్థిదీ ఒక్కో పద్ధతి. ఒకరికి ఎంతో ప్రభావవంతంగా అనిపించిన ఓ విధానం మరొకరికి అంతగా నప్పకపోవచ్చు
నేర్చుకోవడంలో ఒక్కో విద్యార్థిదీ ఒక్కో పద్ధతి. ఒకరికి ఎంతో ప్రభావవంతంగా అనిపించిన ఓ విధానం మరొకరికి అంతగా నప్పకపోవచ్చు. అందుకే మన ‘లెర్నింగ్ స్టైల్’ ఏంటి అనేది తెలుసుకుంటే.. చదువుకోవడం ఆసక్తిగా అనిపిస్తుంది. ఇందులో ఎన్ని రకాలున్నాయంటే...
ఒక విద్యార్థి ఏ విధానంలో విషయాన్ని త్వరగా నేర్చుకుంటాడో అదే తన లెర్నింగ్ స్టైల్ (అభ్యాస పద్ధతి). ఇందులో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అవి.. చూడటం (విజువల్), వినడం (ఆడిటరీ), చదవడం/రాయడం (రీడ్/రైట్), అనుభవపూర్వక అభ్యాసం (కినస్తటిక్). దీన్నే వార్క్ (్ర్చ౯ఁ) మెథడాలజీ అని కూడా అంటారు. దాదాపు ప్రతి విద్యార్థీ ఇందులో ఏదో ఒక విధానంలో ఇష్టంగా, వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఎందుకు తెలుసుకోవాలి?
మనం నేర్చుకునే పద్ధతిని గుర్తించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది విషయ సంగ్రహణను వేగవంతం చేయగలదు. ఏం చేస్తే బాగా అర్థమవుతుందో గుర్తిస్తే, అనవసరమైన విధానాలతో సమయం వృథా కాదు. త్వరగా విషయాలను నేర్చుకోవడంతోపాటు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఈ లెర్నింగ్ స్టైల్‌ను అంచనా వేసేందుకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా క్విజ్‌లు, సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పాల్గొని, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఏ పద్ధతి మనకు బాగా నప్పుతుందో తెలుసుకోవచ్చు.
1 విజువల్
సబ్జెక్టును కళ్లతో చూడటం ద్వారా ఎక్కువగా నేర్చుకునేవారు ఈ కోవలోకి వస్తారు. వీరు ఫొటోలు, రేఖాచిత్రాలు, గ్రాఫిక్స్, వీడియోలు, చార్టులు, మాప్‌లు, మైండ్ మాప్‌లు, ఫ్లాష్ కార్డ్స్ వంటివి ఉపయోగిస్తే బాగా చదువుకోగలరు. కంటికి ఎదురుగా విషయం కనిపించడం ఇందులో ప్రధానం. వీలైనంతంగా విజువల్ రిప్రజెంటేషన్ ఉండే విధంగా చదివితే వీరికి ఎక్కువ కాలం గుర్తుంటుంది.
2 ఆడిటరీ
వినడం ద్వారా నేర్చుకునే వారిని ఆడిటరీ లెర్నర్స్ అంటారు. వీరికి పాఠాలను పదేపదే వినడం, దాని గురించి మాట్లాడటం, బృందంలో చర్చించడం, ముఖ్యమైన పదాలను నెమరువేసుకోవడం వంటి వాటి వల్ల బాగా గుర్తుంటుంది. ఇందుకు ఆడియో రికార్డులు బాగా పనికొస్తాయి. పాఠాలను రికార్డు చేసుకుని వింటూ ఉండటం వల్ల చదవడం కంటే కూడా బాగా నేర్చుకోగలుగుతారు.
3 రీడ్/రైట్
వీరికి పేరులో చెప్పినట్టుగానే మళ్లీ మళ్లీ చదవడం, రాయడం ద్వారా విషయం బాగా గుర్తుంటుంది. ఇది ఎక్కువ మంది ఆచరించే సంప్రదాయ పద్ధతి. ఇందులో రాయడం - చదవడంతోపాటు వివరంగా నోట్సు తయారుచేయడం, పునశ్చరణ చేయడం, సమాచారాన్ని రాత రూపంలో చూడటం ద్వారా వీరు త్వరగా నేర్చుకోగలరు.
4 కినస్తటిక్
వీరికి ప్రాజెక్టులు-యాక్టివిటీల్లో పాల్గొనడం, ప్రయోగాలు చేయడం, మెటీరియల్స్‌ను తాకడం... ఇలా పాఠంతో పూర్తిగా మమేకం కావడం వల్ల ఎక్కువగా నేర్చుకోగలరు. ఇది తక్కువ వయసు విద్యార్థుల్లో ఎక్కువగా గమనించవచ్చు. అయితే కొందరు కాలేజీ వయసులో కూడా ఫిజికల్ యాక్టివిటీని అధికంగా ఇష్టపడతారు.
చూశారుగా... మరి మీ స్టైల్ ఏంటో తెలుసుకుని వెంటనే సాధన మొదలుపెట్టండి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
politics: politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్లీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్
-
BJP: తెదేపా- జనసేన పొత్తుపై స్పందించిన పురంధేశ్వరి
-
Kuldeep Yadav: బాగా ఆడుతున్నాడని కుల్దీప్ను పాక్ జట్టుకు సెలెక్ట్ చేయలేం కదా.. ఇంజమామ్ చమత్కారం