జేఎన్‌యూలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

ఐదు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో సేవలను అందిస్తున్న న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ తాజాగా నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది

Updated : 28 Feb 2023 05:10 IST

ఐదు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో సేవలను అందిస్తున్న న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ తాజాగా నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటించిన మొత్తం 388 ఖాళీల్లో పోస్టును అనుసరించి దరఖాస్తుదారులకు పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, స్టెనోగ్రఫీతోపాటు పని అనుభవం అవసరం.   

1. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు డిగ్రీ పాసవ్వాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలను, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలను టైప్‌ చేయగలగాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

2. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి.

3. స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు డిగ్రీ పాసవ్వాలి. ఇంగ్లిష్‌ లేదా హిందీ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలను రాయగల నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

4. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రెండేళ్ల ఐటీఐ డిప్లొమా పాసవ్వాలి. కేంద్ర/ రాష్ట్ర/ పీఎస్‌యూ/ యూనివర్సిటీలు/ ఉన్నత విద్యా సంస్థల్లో ఐదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గవర్నమెంట్‌ కాంట్రాక్టర్‌ దగ్గర ఐదేళ్లు పనిచేసిన అనుభవం అవసరం.   

5. కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్‌తో బీఈ/బీటెక్‌ చేయాలి. కేంద్ర/ రాష్ట్రప్రభుత్వ/ పీఎస్‌యూ/ యూనివర్సిటీలు/ ఉన్నత విద్యా సంస్థలో ఐదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

6. సిస్టమ్‌ ఎనలిస్ట్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చేయాలి. సీ/సీ++/జావా లాంగ్వేజ్‌లో ఐదేళ్ల ప్రోగ్రామింగ్‌ అనుభవం ఉండాలి. లేదా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎంసీఏ చేయాలి. లేదా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌ చేయాలి. సీ/సీ++/జావాలో మూడేళ్ల ప్రోగ్రామింగ్‌ అనుభవం ఉండాలి.

7. మెస్‌ హెల్పర్‌ పోస్టుకు పదో తరగతి పాసవ్వాలి. విద్యా సంస్థలు/ యూనివర్సిటీ మెస్‌లో మూడేళ్ల పని అనుభవం అవసరం.  

ఏ పోస్టులు? ఎన్ని?

డిప్యూటీ రిజిస్ట్రార్‌-2, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-3, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌-1, సెక్షన్‌ ఆఫీసర్‌-8, సీనియర్‌ అసిస్టెంట్‌-8, అసిస్టెంట్‌-3, జూనియర్‌ అసిస్టెంట్‌-106, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-79, ప్రైవేట్‌ సెక్రటరీ-1, పర్సనల్‌ అసిస్టెంట్‌-6, స్టెనోగ్రాఫర్‌-22, రిసెర్చ్‌ ఆఫీసర్‌-2, ఎడిటర్‌ పబ్లికేషన్‌-2, క్యూరేటర్‌-1, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-1, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-1, సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-8, కుక్‌-19, మెస్‌ హెల్పర్‌-49, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)-1, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-1, వర్క్స్‌ అసిస్టెంట్‌-16, ఇంజినీరింగ్‌ అటెండెంట్‌-22, లిఫ్ట్‌ ఆపరేటర్‌-3, సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌-1, సిస్టమ్‌ అనలిస్ట్‌-2, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-2, కంప్యూటర్‌ ఆపరేటర్‌-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ టెక్నీషియన్‌-1, జూనియర్‌ ఆపరేటర్‌-2, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌-2, టెక్నీషియన్‌-ఎ-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ (గెస్ట్‌హౌస్‌)-1, కార్టోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-3, ల్యాబొరేటరీ అటెండెంట్‌-2, స్టాఫ్‌నర్స్‌-1, స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ ఆఫీసర్‌-1 

వయసు: అన్ని పోస్టులకూ గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. డిప్యూటీ రిజిస్ట్రార్‌, సీనియర్‌ సిస్టమ్‌ ఎనలిస్ట్‌ పోస్టులకు మాత్రం గరిష్ఠ వయసు 50 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: మొత్తం పోస్టులను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎ పోస్టులకు ఫీజు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు రూ.1000. పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. గ్రూప్‌-బి పోస్టులకు ఫీజు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు రూ.600. పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. 

ఎంపిక: అభ్యర్థులను రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. రాత పరీక్షకు 70 శాతం మార్కులు, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 30 శాతం మార్కులు కేటాయించారు. గ్రూప్‌-బి, గ్రూప్‌-సి కేటగిరీకి చెందిన పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు. 

ముఖ్యాంశాలు: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే పోస్టును బట్టి వేర్వేరుగా దరఖాస్తు ఫీజులను చెల్లించాలి.

* పాత ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వీటి సహాయంతో రాత పరీక్షకు సన్నద్ధం కావచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2023 

వెబ్‌సైట్‌: http://recruitment.nta.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని