Exam Preparation: పరీక్షకు వెళ్తున్నారా... ఇలా చేయొద్దు!
పరీక్షలకు వెళ్లే ముందు ఏం చేయాలో మనకు బాగా తెలుసు. మరి ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలిగా! పరీక్షల సీజన్ మొదలుకాబోతున్న నేపథ్యంలో... ఎగ్జామ్‌కు ముందు కచ్చితంగా చేయకూడని పనులేంటో, అలా చేయకపోవడం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం..
పరీక్షలకు వెళ్లే ముందు ఏం చేయాలో మనకు బాగా తెలుసు. మరి ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలిగా! పరీక్షల సీజన్ మొదలుకాబోతున్న నేపథ్యంలో... ఎగ్జామ్‌కు ముందు కచ్చితంగా చేయకూడని పనులేంటో, అలా చేయకపోవడం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం..
పరీక్షకు ముందు ఒకటి రెండు రోజుల్లో కొత్త టాపిక్ లేదా కొత్త మెటీరియల్ చదవడం చేస్తుంటారు కొందరు. ఇది సరైన సన్నద్ధత కాదు. ఆ విషయం పూర్తిగా కొత్తది కావడం వల్ల దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, గుర్తుంచుకోలేకపోవడం వంటివి జరగొచ్చు. అదే జరిగితే పరీక్ష సమయంలో ఇతర జవాబులపైనా దీని ప్రభావం పడుతుంది. అవి గుర్తుతెచ్చుకోలేక ఇబ్బంది పడతాం. అందుకే పరీక్షకు రెండు రోజుల ముందు ఎటువంటి కొత్త టాపిక్స్ చదవడం మంచిది కాదు. బాగా వచ్చినవాటినే రివిజన్ చేస్తూ ఉండాలి.
* ముఖ్యమైన పనులను, కష్టమైన పాఠాలను చివర్లో చూసుకుందాం అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు. పరీక్షకు ముందు ఎటువంటి అదనపు ఒత్తిడీ పెట్టుకోవడం సరికాదు. మనసు వీలైనంత తేలిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే ఆ రోజుకంటే ముందే పనులన్నీ పూర్తిచేయాలి.
* రిలాక్స్ అయ్యేందుకైనా సరే... టీవీ, ఫోన్, సోషల్‌మీడియా జోలికి వెళ్లడం మంచిది కాదు. పరీక్షకు ముందు రెండు మూడు నెలల సన్నద్ధత సమయంలో అడపాదడపా చూసినా పరీక్షకు ముందు మాత్రం అస్సలు వాటిని వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. విద్యార్థి ధ్యాస మొత్తం పరీక్షపైనే ఉండాలని చెబుతున్నారు.
* ఇతర విద్యార్థులు, స్నేహితులతో అతిగా చర్చించడం, చదివిన - చదవాల్సిన టాపిక్స్ గురించి కంగారు పడటం వంటివి సరికాదు. దీనివల్ల లేనిపోని ఒత్తిడి మొదలవుతుంది. అవతలివారు మనకంటే ఎక్కువ చదవారనే భావనతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరి సన్నద్ధత వేరువేరుగా ఉంటుంది. ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల ఎవరితోనైనా సరే పోలిక అనవసరం.
* టెన్షన్‌తో సరిగ్గా తినకపోవడం లేదా అతిగా తింటూ ఉండటం, సరిగ్గా నిద్రపోకపోవడం, కెఫీన్ కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయకూడదు. ఇవి పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై దుష్ప్రభావం చూపగలవు.
* ప్రశాంతంగా ఉండకుండా అతిగా ఆలోచించడం, ఆ అసహనంతో చుట్టుపక్కల వాతావరణాన్ని పాడుచేసుకోవడం వంటివి చేయకూడదు. వీలైనంత రిలాక్స్‌గా ఉంటూ చేయాల్సిన పనులు, రివిజన్‌ను ఒత్తిడికి లోనుకాకుండా నెమ్మదిగా చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల ఇంట్లోవారికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
* అలాగే పరీక్ష రోజుకు చేసుకోవాల్సిన ఏర్పాట్లు చివరివరకూ చేయకుండా వదిలేయడం, కావాల్సిన అందుబాటులో ఉంచుకోకపోవడం వంటివి అస్సలు సరికాదు. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంటేనే పరీక్షకు పూర్తిగా సిద్ధపడినట్టు! .
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్