మనకోసం...ఎడ్యుటైన్‌మెంట్!
ఎడ్యుటైన్‌మెంట్!..లెర్నింగ్‌లో ఒక కొత్త పంథా. నేర్చుకోవడాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో చాలాచోట్ల అనుసరిస్తున్న విధానం
ఎడ్యుటైన్‌మెంట్!..లెర్నింగ్‌లో ఒక కొత్త పంథా. నేర్చుకోవడాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో చాలాచోట్ల అనుసరిస్తున్న విధానం. ఇదేంటో మనమూ చూసేద్దాం!
గంటలతరబడి కూర్చుని ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు గ్యాప్ లేకుండా చూసేస్తాం. నచ్చిన ఫ్రెండ్స్‌తో మాటలు మొదలుపెట్టి టైం ఎంతయ్యిందో కూడా తెలీకుండా కబుర్లలో మునిగిపోతాం. ఇలాంటి సమయాల్లో అస్సలు అలసట తెలియదు, ఎక్కడా బోర్ కొట్టదు... కానీ పుస్తకం తీస్తే మాత్రం అరగంటకోసారి ఆవులిస్తూ అవస్థలు పడతాం. ఎందుకిలా?
* ఎందుకంటే ముందుచెప్పిన రెండు విషయాలు మనకు ఎంటర్‌టైన్‌మెంట్. మనసు వద్దన్నా దానిపై వందశాతం ఏకాగ్రత పెడుతుంది. కానీ చదువు అలా కాదు. తెలియని విషయాలను, అంతగా ఆసక్తి కలిగించని అంశాలను పట్టుబట్టి నేర్చుకోవడం కష్టమే.
* మరి చదువు కూడా సరదా అంశాల్లా ఆసక్తికరంగా మారితే బాగుంటుంది కదా? ఈ ఆలోచనతోనే ఈ సరికొత్త విధానం రూపుదిద్దుకుంది, అదే ‘ఎడ్యుటైన్‌మెంట్’. ఎడ్యుకేషన్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలగలిపిన ఈ పద్ధతిలో నేర్చుకోవడం చాలా సరదాగా ఉంటుంది!
* ఈ విధానాన్ని అమెరికన్ విద్యావేత్తలు తొలిసారిగా ప్రతిపాదించారు. తరగతిగదిలోనూ, ఇంటివద్ద విద్యార్థులు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కథలు, చిత్రాలు, బోర్డ్ గేమ్స్, వీడియోగేమ్స్ ఇంకా ఎన్నో రకాలైన సరదా అంశాలను ఉపయోగించడం ఇందులో ఉంటుంది.
* పజిల్స్, చెస్ వంటి సంప్రదాయ ఆటలతోపాటు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అధికంగా లభిస్తున్న ఎడ్యుకేషనల్ గేమ్స్ ద్వారా విద్యార్థులు సులువుగా నేర్చుకునేలా వారిని ప్రోత్సహించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
* ఇప్పుడు చాలా పాశ్చాత్య యూనివర్సిటీల్లో లెగోస్ (బిల్డింగ్ బ్లాక్స్)ను ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్, రోబోటిక్స్ వంటి సబ్జెక్టులు నేర్పేందుకు ఉపయోగిస్తున్నారు! అంతేకాదు.. సబ్జెక్టుకు సంబంధించిన డాక్యుమెంటరీలు చూడటం, గేమిఫికేషన్, స్టోరీ టెల్లింగ్ మెథడ్స్‌ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు మరింత ఇష్టంగా నేర్చుకునేలా చేయడం దీని వెనకున్న ప్రధాన లక్ష్యం.
ఎన్నోలాభాలు
ఇటువంటి ఆసక్తికర విధానాలతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా ఇంటరాక్టివ్ విధానంలో పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఉత్తమ గ్రేడ్లు పొందడమే కాదు, పాఠాలను ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం, సందర్భానికి తగినట్లు ఉపయోగించడం చేయగలుగుతారు. వీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడమే కాదు.. బృందాల్లో కలసిమెలసి పనిచేయగలుగుతారు. ఇది విద్యార్థుల ప్రేరణను, ఏకాగ్రతను, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని.. పెంపొందిస్తుందని రుజువైంది.
ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. వీటిలో కోడింగ్, వందలకొద్దీ అకడమిక్ టాపిక్స్, స్టెమ్ సబ్జెక్టులను సైతం చాలా సరదాగా నేర్చుకోవచ్చు. కొన్ని సైట్లు వర్చువల్ రియాలిటీను కూడా ఉపయోగిస్తున్నాయి. విద్యార్థి చేయాల్సిందల్లా వాటిలోకి లాగిన్ అయ్యి నేర్చుకోవడమే! అయితే ఇలా చదివేటప్పుడు దృష్టి మొత్తం పాఠంపైనే ఉండాలి సుమా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..
-
Crime News
Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్ ప్లాన్
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్ రెడ్డి
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?