ఎన్‌పీడీసీఎల్‌ ఉద్యోగాలకు సిద్ధమా?

వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.

Updated : 13 Apr 2023 22:30 IST

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌
కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు

వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.

రంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ విద్యుత్‌ సర్కిళ్లలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఏ/బీఎస్సీ/బీకామ్‌తోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఆఫీస్‌ ఆటోమేషన్‌ (ఎంఎస్‌ ఆఫీస్‌) సర్టిఫికెట్‌ కోర్సు పాసైనవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 01.01.2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇప్పటికే టీఎస్‌ ట్రాన్స్‌కో/ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి విషయంలో.. ఉద్యోగంలో చేరినప్పటి వయసును పరిగణనలోకి తీసుకుంటారు. వీరు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాల్సి ఉంటుంది.

రాత పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను హాల్‌టికెట్‌లో తెలియజేస్తారు. పరీక్ష తేదీకి ముందు హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ.320 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

రాత పరీక్ష ఎలా?

పరీక్ష వ్యవధి 2 గంటలు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్‌ షీట్‌ మీద సమాధానాలను గుర్తించాలి. రాత పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులను సాధించాలి. ఈ మార్కులు బీసీలకు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు 30 శాతం. రాత పరీక్షను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ జీడబ్లూఎంసీ పరిధిలోని వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. దీంట్లో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు (40 మార్కులు). సెక్షన్‌-బిలో కంప్యూటర్‌ అవేర్‌నెస్‌కు చెందిన 20 ప్రశ్నలు (20 మార్కులు). సెక్షన్‌-సిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు (20 మార్కులు) ఉంటాయి.

* సెక్షన్‌-ఎలోని న్యూమరికల్‌ ఎబిలిటీలో.. ఇండిసెస్‌, రేషియోస్‌, ప్రపోర్షన్స్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, మెన్సురేషన్‌, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఉంటాయి. ఇవేకాకుండా లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

* సెక్షన్‌-బి కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో.. ఎంఎస్‌-ఆఫీస్‌, బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ స్కిల్స్‌, అకౌంట్స్‌ రిలేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ అంశాలు ఉంటాయి.

* సెక్షన్‌-సిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ,  కాంప్రహెన్షన్‌ పాసేజెస్‌ అండ్‌ రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, సిననిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్‌ ఉంటాయి.

* జనరల్‌ నాలెడ్జ్‌లో భాగంగా.. కరెంట్‌ అఫైర్స్‌, కన్సూమర్‌ రిలేషన్స్‌, జనరల్‌ సైన్స్‌ ఇన్‌ ఎవ్రిడే లైఫ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహత్యం..   మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

* ప్రశ్నపత్రం 80 మార్కులకు, ఇన్‌సర్వీస్‌ వెయిటేజి మార్కులు 20 ఉంటాయి. ఉద్యోగప్రకటన జారీ నాటికి టీఎస్‌ ట్రాన్స్‌కో/ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పనిచేస్తున్నవారికి వెయిటేజీ మార్కులు ఉంటాయి. ఆరునెలకు 1 మార్కు చొప్పున ఇస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు. ఆరు నెలలకంటే తక్కువ సర్వీసు ఉన్నవారికి వెయిటేజీ మార్కుల నియమం వర్తించదు.

వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, పీహెచ్‌లకు 4 శాతం,   ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 2 శాతం, మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల కాలానికి ట్రైనింగ్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఉంటుంది. విధుల్లో చేరే సమయంలో  ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, క్యాస్ట్‌ అండ్‌ స్టడీ/ రెసిడెన్స్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో     చేరే సమయంలో ఐదేళ్లకు (ప్రొబేషన్‌కు అదనంగా) బాండ్‌ రాయాలి.


గమనించండి!

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2023

దరఖాస్తు సవరణ తేదీలు: 02.05.2023 నుంచి 05.05.2023 వరకు

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభ తేదీ: 22.05.2023

రాత పరీక్ష : 28.05.2023

వెబ్‌సైట్‌:  http://tsnpdcl.cgg.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని