తొందరపడుతున్నారా?
ఆ కాలేజీనా, ఈ కోర్సా, హాస్టల్‌లో ఉండాలా, లేక ఇల్లా, కాలేజ్ బస్సా బైకా అని ఆలోచిస్తూ గడిపేస్తున్నారా... అంతేమరి, అకడమిక్ ఏడాది మొదలవుతుంది అంటేనే ఇలాంటివి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది
ఆ కాలేజీనా, ఈ కోర్సా, హాస్టల్‌లో ఉండాలా, లేక ఇల్లా, కాలేజ్ బస్సా బైకా అని ఆలోచిస్తూ గడిపేస్తున్నారా... అంతేమరి, అకడమిక్ ఏడాది మొదలవుతుంది అంటేనే ఇలాంటివి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ తీసుకునే క్రమంలో తొందరపడితే తర్వాత ఇబ్బందిపడే ప్రమాదం ఉంటుంది. మరి నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమెలా?
*భవిష్యత్తు ఎప్పుడూ మనం వర్తమానంలో తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలు మొత్తం జీవితాన్నే ప్రభావితం చేయగలవు. చదవాలి అనుకునే కోర్సులు, అందుకు వెళ్లాల్సిన కొత్త ప్రదేశాలు, ఆర్థిక వ్యవహారాలు.. ఇటువంటి నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడమే మేలు.
ప్రశ్నలు: ఏది ఎంచుకునేటప్పుడైనా మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మంచిది. ‘ఇది నాకు నచ్చిందా, నేను చేయగలనా, అసలు ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, చేయకపోతే ఏం నష్టపోతాను, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి... ’ ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకుని సమాధానాలు తెలుసుకుంటే నిర్ణయంలో కచ్చితత్వం ఉంటుంది.
సమాచారం: ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సరైన సమాచారం సేకరించడం అవసరం. పూర్తిగా తెలియకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు రెండు కాలేజీల్లో ఏది ఎంచుకోవాలి అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కాస్త ఆగి.. కోర్సు నాణ్యత, బోధన వసతులు, క్యాంపస్ వాతావరణం, ఫీజు, ఇంటి నుంచి దూరం, వసతి - రవాణా సౌకర్యం, ప్రాంగణ ఎంపికలకు వస్తున్న కంపెనీలు, గత కొన్నేళ్లలో సాధించిన ప్యాకేజీలు.. ఇలా అన్ని వివరాలూ తెలుసుకుంటే పోలిక చూసుకుని సరైనది ఎంపిక చేసుకోగలం.
అభిప్రాయాలు: ఏదైనా ముఖ్యమైన నిర్ణయం అనుకున్నప్పుడు తల్లిదండ్రుల, అధ్యాపకుల, శ్రేయోభిలాషుల అభిప్రాయాలు తీసుకోవడం ఉత్తమం. అలా అని అందరూ చెప్పినవన్నీ అలాగే పాటించాలని కాదు. చివరిగా మనకు నప్పేదే చేసినా... వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగవుతాయి. ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవడం సులభమవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tovino Thomas: ‘ది కేరళ స్టోరీ’ స్థానంలో ‘2018’కి ఆస్కార్ ఎంట్రీ?’.. టొవినో రియాక్షన్ ఏంటంటే?
-
Tirumala: ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన తితిదే
-
Pakistan: పాక్‌లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?