నోటీస్‌ బోర్డు

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 10 Mar 2020 00:13 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

హెచ్‌ఎస్‌ఎల్‌, విశాఖపట్నం

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 51

పోస్టులు: డిజైనర్‌, జూనియర్‌ సూపర్‌వైజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 07, 2020.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపించడానికి చివరితేది: ఏప్రిల్‌ 14, 2020.

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in/


అప్రెంటిస్‌షిప్‌

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ అప్రెంటిస్‌ (సీఎస్‌ఈ, ఈసీఈ)

మొత్తం ఖాళీలు: 90

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 16, 2020

వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/


డీఆర్‌డీఓ-ఏఎస్‌ఎల్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ-అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ (ఏఎస్‌ఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 60

అర్హత: సంబంధిత ట్రేడ్‌/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (మార్చి 07-13)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


ప్రవేశాలు

ఎస్‌కేయూసెట్‌ - 2020

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో 2020-21 సంవత్సరానికిగానూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్‌కేయూసెట్‌ ప్రకటన విడుదలైంది.

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎస్‌కేయూసెట్‌) - 2020

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎస్‌కేయూసెట్‌) ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 11, 2020.

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 10, 2020

వెబ్‌సైట్‌: http://skudoa.in/

మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


లైబ్రరీ

పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.

లాసెట్‌ సమాచారం

మూడు, అయిదు సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా-సెట్‌కి సంబంధించిన ప్రీవియస్‌ పేపర్లు, పరీక్షలోని నాలుగు విభాగాల సమాచారం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో.

తెలుగులో - పేజీలు: 592, ధర: రూ. 399;

ఆంగ్లంలో - పేజీలు: 624, ధర: రూ. 499

ఎడ్‌సెట్‌ మోడల్‌ పేపర్లు

బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌కి ఉపయోగపడే ప్రీవియస్‌పేపర్లు, మోడల్‌ పేపర్లు సమాధానాలతో.

సోషల స్టడీస్‌ టాప్‌ 44 మోడల్‌ పేపర్స్‌, పేజీలు: 288, ధర: రూ. 159;

బయోలాజికల్‌ సైన్స్‌ టాప్‌ 46 మోడల్‌ పేపర్స్‌, పేజీలు: 264, ధర: రూ. 159;

ఫిజికల్‌ సైన్స్‌ టాప్‌ 29 మోడల్‌ పేపర్స్‌, పేజీలు: 264, ధర: రూ. 159;

మ్యాథమేటిక్స్‌ టాప్‌ 26 మోడల్‌ పేపర్స్‌, పేజీలు: 264, ధర: రూ. 159. ప్రచురణ: విజేతకాంపిటీషన్స్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని