ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ...

Published : 06 Apr 2020 00:07 IST

తెలంగాణలో 2,157 స్టాఫ్‌ నర్సులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 2,157 పోస్టులు-ఖాళీలు: పల్లియేటివ్‌ కేర్‌ స్టాఫ్‌ నర్స్‌-82, ఎంఎల్‌హెచ్‌పీ స్టాఫ్‌ నర్స్‌-435, స్టాఫ్‌ నర్స్‌-1,640. అర్హత: జీఎన్‌ఎం/ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2020 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: ఏప్రిల్‌ 06, 2020.

వెబ్‌సైట్‌: http://www.health.telangana.gov.in/

పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌

చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 159 పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌/ సీనియర్‌ డిమాన్‌స్ట్రేటర్‌.

విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పాథాలజీ, సైకియాట్రీ, బయోఫిజిక్స్‌ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్‌/ పరిశోధన అనుభవం.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్‌ ఆధారంగా. పరీక్ష తేది: మే 29, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది:ఏప్రిల్‌ 26, 2020. వెబ్‌సైట్‌: http://pgimer.edu.in/

సమీర్‌లో సైంటిస్టులు

ముంబయిలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(సమీర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్ట్‌ మొత్తం ఖాళీలు: 30 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2020.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: మే 15, 2020.

వెబ్‌సైట్‌: https://www.sameer.gov.in/

ఐఐజీఎంలో రిసెర్చ్‌ స్కాలర్స్‌

ముంబయిలోని భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజం (ఐఐజీఎం) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ● రిసెర్చ్‌ స్కాలర్‌మొత్తం ఖాళీలు: 16 విభాగాలు: ఫిజిక్స్‌, అప్లైడ్‌ జియాలజీ, జియోఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఎంఎస్సీ(టెక్నాలజీ) ఉత్తీర్ణత, గేట్‌/ నెట్‌/ ఇన్‌స్పైర్‌ సర్టిఫికెట్‌ అర్హత. ఎంపిక విధానం: గేట్‌/ నెట్‌/ ఇన్‌స్పైర్‌ సర్టిఫికెట్‌ అర్హత, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 17, 2020.

వెబ్‌సైట్‌: http://iigm.res.in/

ప్రవేశాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌) 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రాములు: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ(ఐదేళ్లు), ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ(ఐదేళ్లు), ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ, ఎంబీఏ, ఎంటెక్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ పీహెచ్‌డీ. అర్హత: ప్రోగ్రాముని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 03, 2020.

వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in/

ఎన్‌సీఈఆర్‌టీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్స్‌(ఆర్‌ఐఈ)లో 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రాములు: బీఎస్సీ బీఈడీ(నాలుగేళ్లు), బీఏ బీఈడీ(నాలుగేళ్లు), ఎంఎస్సీ ఎడ్యుకేషన్‌(ఆరేళ్లు), బీఈడీ (రెండేళ్లు), ఎంఈడీ (రెండేళ్లు). ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష తేది: మే 24, 2020. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 ఏప్రిల్‌ 06 నుంచి మే 04 వరకు. వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని