ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Updated : 24 Nov 2022 15:19 IST

నోటీస్‌బోర్డు


ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గ్రామ, వార్డు వాలంటీర్లు
అర్హత: గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌, పట్టణాల్లో డిగ్రీ ఉత్తీర్ణత, స్థానికులై ఉండాలి.

వయసు: 01.01.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ విభాగాల్లో పని చేసిన గత అనుభవం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 24, 2020.

ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్‌ 27 నుంచి 29 వరకు.

వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in/


ఎస్‌పీఆర్‌ఈఆర్‌ఐ

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన సర్దార్‌ పటేల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌పీఆర్‌ఈఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 19 పోస్టులు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
చివరి తేది: ఏప్రిల్‌ 25, 2020.
వెబ్‌సైట్‌: 
http:///spreri.org/


బీపీపీఐ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్‌ విభాగానికి చెందిన బ్యూరో ఆఫ్‌ ఫార్మా పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌టేెకింగ్స్‌ ఆఫ్‌ ఇండియా(బీపీపీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24 పోస్టులు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బీబీఏ, బీసీఏ/ బీఎస్సీ/ బీఫార్మసీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2020.
వెబ్‌సైట్‌: 
http://janaushadhi.gov.in/


ఫెలోషిప్‌
డీబీటీ-జేఆర్‌ఎఫ్‌ 2020

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) 2020 సంవత్సరానికి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ-జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌(డీబీటీ-జేఆర్‌ఎఫ్‌)
అర్హత: బయెటెక్నాలజీలో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బెట్‌) ఆధారంగా.

పరీక్ష తేది: జూన్‌ 30, 2020.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 18, 2020.

వెబ్‌సైట్‌: https://rcb.res.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని