Updated : 21 May 2020 01:43 IST

ప్రవేశాలు

ఏపీ డీఈఈసెట్‌-2020

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌ ప్రకటన విడుదలైంది.

* ఏపీ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ డీఈఈసెట్‌)-2020

కోర్సు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కాలవ్యవధి: 2 సంవత్సరాలు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష (డీఈఈసెట్‌) ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2020.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 05, 2020.

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/


పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌

చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: 1) బీఎస్సీ నర్సింగ్‌-ఫిమేల్‌ (నాలుగేళ్లు)-93 సీట్లు 2) బీఎస్సీ నర్సింగ్‌ (పోస్ట్‌-బేసిక్‌)(రెండేళ్లు)-62 సీట్లు.

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2020 నాటికి 17-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: జులై 28, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 20, 2020.

వెబ్‌సైట్‌: http://pgimer.edu.in/

 


ఐఐఎస్‌టీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పీహెచ్‌డీ ప్రోగ్రాం-జులై 2020

విభాగాలు: ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియోనిక్స్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, యూజీసీ-నెట్‌-జేఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌, గేట్‌ స్కోర్‌.

వయసు: 15.06.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

వీఎంఎంసీ-ఎస్‌జేహెచ్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సఫ్తర్‌జంగ్‌ హాస్పిటల్‌ అండ్‌ వీఎంఎంసీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ రెసిడెంట్‌

మొత్తం ఖాళీలు: 282

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. ao.academic@vmmcn/sjh.nic.in

చివరి తేది: మే 31, 2020.

వెబ్‌సైట్‌: http://www.vmmcn/sjh.nic.in/


దరఖాస్తు చేశారా?

సీపీసీబీ, దిల్లీ

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 25, 2020.

* ఏపీ హైకోర్టులో టెక్నికల్‌ స్టాఫ్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/ బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 26, 2020.

* ఐసీఎంఆర్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత. చివరి తేది: మే 27, 2020.

* ఎన్‌ఎఫ్‌ఎల్‌లో వివిధ పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: మే 27, 2020.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts