నోటీస్‌బోర్డు

బెంగళూరులోని సెంట్రల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంటీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 11 Oct 2022 14:32 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సీఎంటీఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

బెంగళూరులోని సెంట్రల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంటీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34.

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఫెలో.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: est.cmti@nic.in

చివరి తేది: జూన్‌ 12, 2020.

వెబ్‌సైట్‌: https://cmti-india.net/


ఎన్‌ఐఓలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

గోవాలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్‌ అసిస్టెంట్‌

మొత్తం ఖాళీలు: 24.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జులై 17, 2020.

వెబ్‌సైట్‌: https://www.nio.org/


ప్రవేశాలు

ఎస్‌వీయూసెట్‌-2020

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్‌వీయూ) 2020-21 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 03, 2020.

దరఖాస్తుకు చివరి తేది: జులై 05, 2020.

వెబ్‌సైట్‌: http://www.svudoa.in/


ఐఐపీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం

ముంబయిలోని భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ)2020-22 విద్యాసంవత్సరానికి 36వ బ్యాచ్‌ పీజీడీపీ ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌(పీజీడీపీ) 2020-22

అర్హత: సంబంధిత సైన్స్‌ సబ్జెక్టుల్లో డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 31.05.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

పరీక్ష తేది: జులై 21, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2020.

వెబ్‌సైట్‌: https://iip-in.com/


ఆర్‌సీబీ-జీఏటీ-బి 2020

ఫరీదాబాద్‌లోని భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ) గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయోటెక్నాలజీ(జీఏటీ-బీ)-2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డీబీటీ సపోర్టెడ్‌ బయోటెక్నాలజీ పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్ఛు.

గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయోటెక్నాలజీ(జీఏటీ-బీ)-2020

పీజీ ప్రోగ్రాములు: ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, ఎంవీఎస్సీ, ఎంటెక్‌ బయోటెక్నాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సైన్స్‌ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: జూన్‌ 30, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 18, 2020.

వెబ్‌సైట్‌: https://rcb.res.in/


అప్రెంటిస్‌షిప్‌

నార్త్‌ సెంట్రల్‌ రైల్వే

ప్రయాగ్‌రాజ్‌(యూపీ) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ సెంట్రల్‌ రైల్వే(ఎన్‌సీఆర్‌)కి చెందిన ఝాన్సీలోని వేగన్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

యాక్ట్‌ అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 196

విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌(గ్యాస్‌ & ఎలక్ట్రిక్‌), మెకానిక్‌ మెషిన్‌ & టూల్‌ మెయింటెనెన్స్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌(హిందీ).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జులై 15, 2020.

వెబ్‌సైట్‌: https://ncr.indianrailways.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని