నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2020 సంవత్సరానికి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 09 Nov 2020 01:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఎగ్జామ్‌

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2020 సంవత్సరానికి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
పోస్టులు: 01) లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ)/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌  2) పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ 3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌. ఖాళీలు: ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్ష తేదీలు: టయర్‌ 1 - ఏప్రిల్‌ 12, 2021 - ఏప్రిల్‌ 27, 2021  టయర్‌-2: వెల్లడించాల్సి ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 15, 2020. వెబ్‌సైట్‌:
https://ssc.nic.in/


ఐసీఎంఆర్‌లో సైంటిస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 65  పోస్టులు-ఖాళీలు: 1) సైంటిస్ట్‌-ఈ: 43, 2) సైంటిస్ట్‌-డి: 22. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ తత్సమాన ఉత్తీర్ణత, టీచింగ్‌/ పరిశోధన అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 05, 2020. వెబ్‌సైట్‌:
https://main.icmr.nic.in/


రైట్స్‌లో 170 ఇంజినీర్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌
మొత్తం ఖాళీలు: 170 విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీర్‌ (సివిల్‌)-50, ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-30, ఇంజినీర్‌ (మెకానికల్‌)-90. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 26, 2020. వెబ్‌సైట్‌: https://rites.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు