నోటీస్‌ బోర్డు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌ల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 22 Feb 2021 01:50 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
నేవీలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌ల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌ గ్రూప్‌-సీ (నాన్‌ గెజిటెడ్‌ ఇండస్ట్రియల్‌) ఖాళీలు

అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా.

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.205/- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 22, 2021.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 07, 2021.

వెబ్‌సైట్‌:www.joinindiannavy.gov.in/


ఏఈసీఎస్‌-హైదరాబాద్‌లో టీచర్లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌ (ఏఈసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రిపరేటరీ టీచర్లు, పీఆర్‌టీలు, టీజీటీలు.

విభాగాలు: ఇంగ్లిష్‌, హిందీ, మాథ్స్‌, బయోలజీ, కెమిస్ట్రీ, సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈడీ, సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటీఈటీ)లో పేపర్‌-1 ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.21250 -రూ.26250 వరకు చెల్లిస్తారు.

పరీక్ష తేదీలు: మార్చి 03, 05, 2021.

వేదిక: అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌-1, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్‌ పోస్ట్‌, హైదరాబాద్‌- 500 062.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చిరునామా: సెక్యూరిటీ కార్యాలయం, డీఏఈ కాలనీ, డీ-సెక్టార్‌ గేట్‌, ఈసీఐఎల్‌ పోస్ట్‌, హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 25, 2021 www.nfc.gov.in/


ఏర్‌ఫోర్స్‌లో 257 సివిలియన్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ రంగంలో భాగంగా ఉన్న ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌ సౌత్‌ వెస్టర్న్‌కు చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్‌-సీ సివిలియన్‌ పోస్టులు

పోస్టులు: మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, హౌజ్‌కీపింగ్‌ స్టాఫ్‌, మెస్‌ స్టాఫ్‌, ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. హిందీ టైపింగ్‌ టెస్ట్‌.

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.25500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/


బీఆర్‌ఓ-జీఆర్‌ఈఎఫ్‌లో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ), జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌(జీఆర్‌ఈఎఫ్‌) విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 459 పోస్టులు: డ్రాఫ్ట్స్‌మెన్‌, సూపర్‌వైజర్‌ స్టోర్‌, రేడియో మెకానిక్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌, స్టోర్‌ కీపర్‌.

అర్హత: పదో తరగతి, సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో సరిఫికెట్‌ కోర్సు చేయాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ (ట్రేడ్‌ టెస్ట్‌), రాత పరీక్ష ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: కమాండెంట్‌ జీఆర్‌ఈఎఫ్‌ సెంటర్‌, దిఘి క్యాంప్‌, పుణె- 411 015. www.bro.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని