నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) ఆధ్వర్యంలోని హైదరాబాద్‌కు చెందిన మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(ఎంఎస్‌ఎంఈ) 2021 సంవత్సరానికి

Published : 15 Mar 2021 00:12 IST

ప్రవేశాలు

ఎంఎస్‌ఎంఈ-హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) ఆధ్వర్యంలోని హైదరాబాద్‌కు చెందిన మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(ఎంఎస్‌ఎంఈ) 2021 సంవత్సరానికి గాను కింది డిప్లొమా కోర్సుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: డిప్లొమా ఇన్‌ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌(డీటీడీఎం), డిప్లొమా ఇన్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌(డీఈసీఈ), డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రొబోటిక్స్‌ ఇంజినీరింగ్‌(డీఏఆర్‌ఈ), డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌(డీపీఈ).
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి.

కోర్సు వ్యవధి: 3 నుంచి 4 ఏళ్లు. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.700.
దరఖాస్తులకు చివరి తేది: మే 22, 2021. పరీక్ష తేది: మే 30, 2021.
పరీక్ష వేదిక: హైదరాబాద్‌. వెబ్‌సైట్‌:
www.citdindia.org/index.htm


ప్రభుత్వ ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌-హైదరాబాద్‌
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు: సూపర్‌వైజర్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌.
విభాగాలు: ప్రింటింగ్‌, టెక్నికల్‌ కంట్రోల్‌, ఐటీ, ఓఎల్‌, హిందీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ(హిందీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత. హిందీ/ ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 10, 2021.
వెబ్‌సైట్‌:
https://spphyderabad.spmcil.com/Interface/Home.aspx



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని