నోటీస్‌బోర్డు

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ తదితర కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్‌-2021 ప్రకటన విడుదల చేసింది.

Updated : 19 Apr 2021 06:23 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూపీఎస్సీ-సీఏపీఎఫ్‌ ఎగ్జామ్‌ 2021

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ తదితర కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్‌-2021 ప్రకటన విడుదల చేసింది.

* అసిస్టెంట్‌ కమాండెంట్‌ * మొత్తం ఖాళీలు: 159

విభాగాలు-ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌-78, సీఆర్‌పీఎఫ్‌-36, సీఐఎస్‌ఎఫ్‌-67, ఐటీబీపీ-20, ఎస్‌ఎస్‌బీ-01

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత. 2021 డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులు. నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.08.2021 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌/ మెడికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: ఆగస్టు 08, 2021. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: మే 05,2021. ‌www.upsc.gov.in/

సాయ్‌లో 320 పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 320 పోస్టులు-ఖాళీలు: కోచ్‌-100, అసిస్టెంట్‌ కోచ్‌-220.

క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, హాకీ, షూటింగ్‌, వెయిట్‌లిప్టింగ్‌, రెెజ్లింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌ తదితరాలు.

అర్హత: డిప్లొమా (కోచింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఒలంపిక్‌/ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మెడల్‌/ఒలంపిక్‌/ అంతర్జాతీయ ప్రదర్శన/ ద్రోణాచార్య అవార్డ్‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, సంబంధిత విభాగంలో (స్పోర్ట్స్‌) ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: మే 20, 2021.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

ఐజీసీఏఆర్‌లో 337 పోస్టులు

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన కల్పక్కం (తమిళనాడు)లోని ఇందిరా గాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ (ఐజీసీఏఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 337 విభాగాలు-ఖాళీలు: డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-98, స్టైపెండరీ ట్రెయినీ(కేటగిరి 1, 2)-239.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 14, 2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను స్వీకరించడానికి చివరి తేది: మే 20, 2021.

చిరునామా: అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, ఐజీసీఏఆర్‌, కల్పక్కం-603102.

వెబ్‌సైట్‌:www.igcar.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని