నోటీస్‌బోర్డు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2021-2022 విద్యాసంవత్సరానికి టీఎస్‌ పీజీఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

Updated : 03 May 2021 00:50 IST

ప్రవేశాలు
టీఎస్‌ పీజీఈసీ-2021

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2021-2022 విద్యాసంవత్సరానికి టీఎస్‌ పీజీఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా గేట్‌/ జీప్యాట్‌ విద్యార్థులకు ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఫార్మా/ ఎంఆర్క్‌/ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. దరఖాస్తుల గడువు: జూన్‌ 16, 2021.
https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_HomePage.aspx 

పార్ట్‌ టైం ప్రోగ్రాములు

స్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ 2021-2022 విద్యాసంవత్సరానికి కంటిన్యూయింగ్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్స్‌ (సీఈఈపీ) ద్వారా కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పార్ట్‌ టైం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు 2021-2022
కోర్సు వ్యవధి: మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.2000 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 14, 2021.

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐటీఐ లిమిటెడ్‌-రాయ్‌బరేలి

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాయ్‌బరేలికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 40 ఇంజినీరింగ్‌ డిప్లొమా హోల్డర్స్‌
విభాగాలు: మెకానికల్‌-29, ఎలక్ట్రికల్‌-07, ఎలక్ట్రానిక్స్‌-04.
అర్హత: 10వ తరగతి, డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌). జీతభత్యాలు: నెలకు రూ.19029 వరకు చెల్లిస్తారు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: మే 15, 2021.

వెబ్‌సైట్‌:www.itiltd.in/careers 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని