నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ (దేవాస్‌)లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 10 May 2021 03:55 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో 135 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ (దేవాస్‌)లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 135
పోస్టులు- ఖాళీలు: వెల్ఫేర్‌ ఆఫీసర్‌-01, సూపర్‌వైజర్‌-02, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-18, జూనియర్‌ టెక్నీషియన్‌-113, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌-01.
విభాగాలు: ఇంక్‌ ఫ్యాక్టరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, స్టెనోగ్రఫీ, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021 మే 12.
దరఖాస్తుకు చివరి తేది: 2021 జూన్‌ 11.
పరీక్ష తేదీలు: 2021 జులై/ ఆగస్టు.
వెబ్‌సైట్‌:
https://bnpdewas.spmcil.com/

సికిందరాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌

సికిందరాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలోని కొవిడ్‌ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 35
పోస్టులు: జనరల్‌ ఫిజిషియన్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, సూపర్‌వైజర్‌, నర్సింగ్‌ ఇన్‌ఛార్జి, నర్సింగ్‌ స్టాఫ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, జీఎన్‌ఎం/ బీఎస్సీ (నర్సింగ్‌), ఎంబీబీఎస్‌, ఎండీ (జనరల్‌ మెడిసిన్‌) ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: 
ceo.scb2009@gmail.com
దరఖాస్తుకు చివరి తేది: 2021 మే 17.
వెబ్‌సైట్‌:
https://secunderabad.cantt.gov.in/

ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 54
పోస్టులు: సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం, నెట్‌/ గేట్‌ అర్హత.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్‌) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021 మే 10.
దరఖాస్తుకు చివరి తేది: 2021 మే 24.
వెబ్‌సైట్‌:
www.ngri.org.in/

ఎన్‌డబ్ల్యూడీఏలో 62 పోస్టులు

భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 62
పోస్టులు: జూనియర్‌ ఇంజినీర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ (షార్ట్‌హ్యాండ్‌/ టైపింగ్‌) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 25, 2021.
వెబ్‌సైట్‌:
www.nwda.gov.in/

వాక్‌-ఇన్స్‌
సీఆర్‌పీఎఫ్‌లో 50 ఖాళీలు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంఓ)
* మొత్తం ఖాళీలు: 50
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్‌.
వాక్‌ఇన్‌ తేది: 13.05.2021.
వేదిక: ఖాళీలున్న వివిధ రాష్ట్రాల సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కార్యాలయాలు.
వెబ్‌సైట్‌:
https://crpf.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని