ప్రభుత్వ ఉద్యోగాలు

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 31 May 2021 00:11 IST

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 5807 టీజీటీ పోస్టులు

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) ఖాళీలు: 5807. సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ. అర్హత: మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (ఎంఐఎల్‌)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్‌), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. టీచింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: వన్‌ టైర్‌/ టూ టైర్‌ రాత పరీక్ష. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 04, 2021. దరఖాస్తుకు చివరి తేది: జులై 03, 2021.

వెబ్‌సైట్‌: https://dsssb.delhi.gov.in/

నిమ్‌హాన్స్‌లో 275 పోస్టులు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆపీసర్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సైకాలజీ సబ్జెక్టుతో బీఏ/ బీఎస్సీ, సైన్స్‌లో బీఎస్సీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, ఎండీ/ ఎంబీబీఎస్‌, బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ (నర్సింగ్‌), లైఫ్‌ సైన్సెస్‌, స్పీచ్‌ పాథాలజీ/ ఆడియాలజీ/ తత్సమాన సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, బేసిక్‌/ మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చిరునామా: డైరెక్టర్‌, నిమ్‌హాన్స్‌, పీబీ.నం.2900, హోసర్‌ రోడ్‌, బెంగళూరు-560029. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 28, 2021.

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/ 

వైద్య సిబ్బంది నియామకాలు  

నంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 39 పోస్టులు: స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆర్‌ఎంఎన్‌సీహెచ్‌ కౌన్సెలర్‌, ఫిజియోథెరపిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణత. వయసు: జులై 01, 2021 నాటికి 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ. దరఖాస్తు గడువు: మే 31, 2021.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

ఎన్‌జీఆర్‌ఐ - హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) నియామకాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 38 పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌.  అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ తత్సమాన, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: పోస్టును అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు గడువు: జూన్‌ 14, 2021.

వెబ్‌సైట్‌: www.ngri.org.in/

ప్రవేశాలు

టీఎస్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్స్‌ స్కూల్స్‌/ జూనియర్‌ కాలేజీలు 2021-2022 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.
మోడల్‌ స్కూల్స్‌/ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రవేశాలు
మీడియం: ఇంగ్లిష్‌. అర్హత: పదో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జులై 05, 2021.
విద్యార్థుల ఎంపిక తేది: జులై 10, 2021. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌: జులై 12, 2021. తరగతులు ప్రారంభం: బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ సెక్రటరీ ఆదేశానుసారం.

వెబ్‌సైట్‌: www.tsmodelschools.in/

డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలు  

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కి చెందిన సిరిసిల్లలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌) 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బీఏ(ఆనర్స్‌) ఫ్యాషన్‌ డిజైన్‌, బీఏ (ఆనర్స్‌) ఇంటీరియర్‌ డిజైన్‌, బీఏ (ఫొటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌). అర్హత: 2020-2021 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 01, 2021. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 20, 2021. https://ttwrdcs.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని