నోటీస్‌బోర్డు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ల్లో.. నావిక్‌ (జనరల్‌ డ్యూటీ), నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌)

Published : 14 Jun 2021 01:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
కోస్ట్‌ గార్డ్‌-350 పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ల్లో.. నావిక్‌ (జనరల్‌ డ్యూటీ), నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌), యాంత్రిక్‌ 01/2022 బ్యాచ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 350 పోస్టులు-ఖాళీలు: నావిక్‌ (జనరల్‌ డ్యూటీ)-260, నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌)-50, యాంత్రిక్‌ (మెకానికల్‌)-20, యాంత్రిక్‌ (ఎల‌్రక్టికల్‌)-13, యాంత్రిక్‌ (ఎల‌్రక్టానిక్స్‌)-07. అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: వివిధ దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, రీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, పోలీస్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, జులై 02. దరఖాస్తు గడువు: 2021, జులై 16.

ttps://joinindiancoastguard.cdac.in/

మజగావ్‌ డాక్‌లో..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌) కింది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1388 పోస్టులు: ఏసీ మెకానిక్‌, కంప్రెషర్‌ అటెండెంట్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, ఫిట్టర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌. ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, జులై 04.

వెబ్‌సైట్‌: https://mazagondock.in/

వాక్‌-ఇన్స్‌
మిధానీలో అసిస్టెంట్‌ పోస్టులు

మినీరత్న కంపెనీ అయిన హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
అసిస్టెంట్‌ (లెవల్‌-4) మెటలర్జీ మొత్తం ఖాళీలు: 21 అర్హత: మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 04.04.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి. వాక్‌ఇన్‌ తేది: 21.06.2021. వేదిక: బ్రహ్మ ప్రకాశ్‌ దేవ్‌ స్కూల్‌, మిధానీ టౌన్‌షిప్‌, హైదరాబాద్‌-500058. వెబ్‌సైట్‌: https://midhaninindia.in/

ప్రవేశాలు
ఎస్‌బీటీఈటీ-ఎల్‌పీసెట్‌ 2021

హైదరాబాద్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ తెలంగాణ (ఎస్‌బీటీఈటీ) 2021-2022 విద్యాసంవత్సరానికి ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఐటీఐ అభ్యర్థులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.
లేటరల్‌ ఎంట్రీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌)-2021 అర్హత: రెండేళ్ల ఐటీఐ, డీఈటీ నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. ముఖ్యమైన తేదీలు:  ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు చివరి తేది: 2021, జూన్‌ 21. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేది: 2021, జూన్‌ 22. దరఖాస్తులకు చివరి తేది: 2021, జూన్‌ 23. ఎల్‌పీసెట్‌-2021 పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: www.sbtet.telangana.gov.in/

అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఐఎల్‌లో 121 ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన కాక్రపారలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 121 ట్రేడులు: ఎల‌్రక్టీషియన్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మెకానిక్‌, ఎల‌్రక్టానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌, టర్నర్‌ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఎన్‌పీసీఐఎల్‌, కాక్రపార గుజరాత్‌ సైట్‌, అనుముల-394651. దరఖాస్తుకు చివరి తేది: 2021, జులై 15.

వెబ్‌సైట్‌: www.npcil.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని